Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం కొనద్దన్న మోడీ... ఇండియన్స్ షాకింగ్ రియాక్షన్ !

బంగారం కొనద్దన్న మోడీ... ఇండియన్స్ షాకింగ్ రియాక్షన్ !

Tupaki.com 1 week ago

రేంద్ర మోడీ ఏదైనా చెబితే జనాలు పాటిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తున్న విషయం. మోడీ ఏమి చెప్పినా చేయడమే భారతీయులకు తెలుసు. మోడీ చెప్పారు అంటే విని తీరాలి అని కూడా ఇండియన్స్ గట్టిగా ఒట్టు పెట్టుకున్నారు.

మోడీ కోసం ఎంతైనా ఎందాకైనా అన్న తీరు కూడా కనబరుస్తారు. అంతటి ఆరాధనాభావం మోడీ అంటే జనాలకు. అది ఎన్నో సమయాల్లో సందర్భాలలో రుజువు అయింది. మోడీకి ఎస్ చెప్పడం తప్ప నో అనడం తెలియదు ఇండియన్స్ కి అని కూడా అంటారు.

నోట్ల రద్దు వేళ :

ఇప్పటికి పదేళ్ళ క్రితం ఒక చలి కాలంలో నవంబర్ నెల మొదటి వారంలో మోడీ చల్లగా ఒక కబురు చెప్పారు. పెద్ద నోట్లు రద్దు అన్నారు. ఈ రోజు నుంచి మీ వద్ద ఉన్న పెద్ద నోటు ఒక్కటీ చెల్లదూ అని చెప్పేశారు. ఇదంతా దేశం కోసం దేశ క్షేమం కోసం అని కూడా మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సావధానంగా విన్న ప్రజలు అంతా ఎస్ మోడీ అనేసారు. అలా ఆసేతు హిమాచలం ముక్తకంఠంతో మోడీకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా మోడీ కోసం జనాలు బ్యాకుల ముందు క్యూ కట్టారు. అంతే కాదు నోట్ల రద్దుతో మధ్య తరగతి పేద వర్గాలు నలిగిపోయినా కూడా అంతా మనసులోనే దాచుకుని జై కొట్టారు. ఎందుకంటే అంతా దేశం కోసమే అని వారు గట్టిగా నమ్మారు. మోడీ చెప్పారంటే అది భారత దేశం ఆర్థికంగా బాగు పడడం కోసమే అని బలంగా నమ్మారు. అందుకే మోడీ సార్ మీరేమంటే మేము సైతం అంటూ వందల కోట్ల జనం వెనకాల నిలబడ్డారు.

కరోనా సంక్షోభంలో :

అంతేనా 2020లో ప్రపంచాన్ని కరోఅనా పెద్ద ఎత్తున ఆవర్హించి విలయతాండవం చేస్తోంది. అయితే భారతీయులు అంతా మోడీ వైపే చూశారు. మాకు నరేంద్ర మోడీ ఉన్నారు ఏమీ కాదని వారు నిబ్బరంగా ఉన్నారు. మోడీ ఆ సమయంలో సీరియస్ గా బయటకు వచ్చి ప్లేట్లు కంచాలు చేతిలో ఏమి ఉంటే అవి గట్టిగా మోగించమన్నారు. కరోనా దెబ్బకు పోతుందని నమ్మి జనాలు కూడా అలాగే చేశారు. సాయం సంధ్య వేళలో ఆ విధంగా జనాలు దేశమంతా మోగించిన ప్లేట్లూ కంచాల మోతకు కరోనా వెళ్ళిందో లేదో తెలియదు కానీ మోడీ పట్ల కోట్లాది మంది ప్రజల విధేయత అంకిత భావం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది.

కట్ చేస్తే ఈ సమయాన :

ఇక తాజాగా చూస్తే 2026 మే 10వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటనకు వచ్చారు. ఆయన హైదరాబాద్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజలకు పొదుపు ఉపదేశాలు చేశారు. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే బంగారం ఎవరూ కొనవద్దు అని. ఏడాది పాటు అయినా బంగారం జోలికి పోవద్దు అని మోడీ జనాలకు పిలుపు ఇచ్చారు. ఆ మరుసటి రోజు గుజరాత్ పర్యటనలో కూడా మోడీ ఇదే రకమైన సందేశం వినిపించారు.

ఈసారి మాత్రం :

ఇప్పటిదాకా మోడీ ఏమి చెబితే అది చేసిన భారతీయ జనాలు మాత్రం ఈసారి ఎందులో రివర్స్ లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. బంగారం కొనవద్దు అని మోడీ ఎంతో పద్ధతిగా జనాలకు విజ్ఞప్తి చేస్తే జనాలు మాత్రం అంతకు రెట్టింపు జోరు చూపించారు. అంతే ఒక్కసారిగా దేశంలో బంగారం అమ్మకాలు ఏకంగా 13 శాతం పెరిగిపోయాయి. మోడీ ఇలా చెబితే అలా చేసే ఇండియన్స్ ఈసారి ఎందుకు రివర్స్ అయ్యారు, వారిలో సడెన్ గా వచ్చిన ఈ చేంజ్ వెనక రీజన్ ఏంటి మాత్రం ఎవరూ అడగవద్దు ఆరా అంతకంటే తీయవద్దు. ఎవరికి మటుకు వారు సొంత బుర్ర పెట్టి ఆలోచించుకుంటే ఆన్సర్ వారికి వెంటనే తట్టేస్తుంది. అదన్న మాట మ్యాటర్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu