Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బేబీ డైరెక్టర్, ఆ స్టార్ కాంబోలో మూవీ పడితే..

బేబీ డైరెక్టర్, ఆ స్టార్ కాంబోలో మూవీ పడితే..

Tupaki.com 1 week ago

టాలీవుడ్‌ లో కొత్త అండ్ క్రేజీ కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి హాట్ టాపిక్‌ గా మారింది హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సాయి రాజేష్ కాంబినేషన్‌.

వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఆ కాంబో నిజమైతే మాత్రం భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దర్శకుడు సాయి రాజేష్ బేబీ సినిమాతో యూత్ ను స్ట్రాంగ్ గా కనెక్ట్ చేశారు. ప్రేమ, బాధ, ఎమోషన్స్‌ ను ప్రెజెంట్ జెనరేషన్ ఎమోషన్స్ ను దగ్గరగా చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనలో ఉన్న అగ్రెసివ్ యాక్టింగ్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్‌ తో యూత్‌ లో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

అందుకే ఆ ఇద్దరి కాంబో గురించి వార్తలు రావడంతోనే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సాయి రాజేష్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్‌ కు విజయ్ సూపర్ యాక్టింగ్ తోడైతే మరో కల్ట్ క్లాసిక్ రావొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాలేజ్ బ్యాక్‌ డ్రాప్‌ లో జరిగే బోల్డ్ లవ్ స్టోరీ అయినా.. లేదా రా ఎమోషన్స్‌ తో కూడిన రిలేషన్‌ షిప్ డ్రామా అయినా ఆా జోడీకి బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్లే తప్ప అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయినప్పటికీ ఆ కాంబోపై ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సాయి రాజేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే దర్శకుడు సుమన్ పాతూరి తెరకెక్కించే మరో చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు షోరన్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో తన బ్లాక్‌ బస్టర్ మూవీ బేబీని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఇక విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలిలో రష్మికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఆా రెండు ప్రాజెక్టులతో పాటు మరికొన్ని సినిమాలు విజయ్ లైన్‌ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పుడు సాయి రాజేష్ ప్రాజెక్ట్ కూడా ఆ లిస్ట్ లోకి చేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ కాంబినేషన్ నిజమైతే.. విజయ్‌ ను మరోసారి పూర్తి స్థాయి ఎమోషనల్ లవర్ బాయ్‌ గా చూస్తామా? లేక మాస్ యాక్షన్ టచ్ ఉన్న కొత్త తరహా పాత్రలో కనిపిస్తారా? అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu