Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ విజయానికి ఆ రెండే కారణాలు: మోడీ

బెంగాల్ విజయానికి ఆ రెండే కారణాలు: మోడీ

Tupaki.com 3 weeks ago

శ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పుట్టిన తర్వాత.. ఆ పార్టీ తొలి సారి ఇక్కడ విజయం సాధించింది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగానే 200లకుపైగా స్థానాల్లో దూసుకుపోయింది. దీనిపై స్పందించిన ప్రధాని ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో మాట్లాడారు. బెంగాల్ విజయానికి ఆయన రెండు కారణాలు చెప్పారు. 1) ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే రాష్ట్రం డెవలప్ అవుతుందని భావించారని మోడీ తెలిపారు.

2) ఏళ్ల తరబడి కార్యకర్తల కృషి: బీజేపీ కార్యకర్తలు ఏళ్ల తరబడి అనేక నిర్బంధాలను.. ఎదుర్కొని కూడా ఇక్కడ విజయం దక్కించుకునేందుకు కసితో పనిచేశారని మోడీ చెప్పారు. గత పాలనలో అనేక నిర్బంధాలను ఎదిరించారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించినా.. వెరవలేదన్నారు. వారి కృషి, అకుంఠిత దీక్ష కారణంగానే పార్టీ విజయం దక్కించుకుం దని తెలిపారు. ఈ విజయం ప్రతికార్యకర్తదీ అని తెలిపారు. ఇది చారిత్రక విజయమని పేర్కొన్న ప్రధాని.. ఎంతో శ్రమించి పార్టీని విజయతీరాలకు చేర్చిన కార్యకర్తలను అభినందిస్తున్నట్టు తెలిపారు.

విజయ్‌కు శుభాకాంక్షలు..

తమిళనాట అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రధాని శుభాకాంక్షలుతెలిపారు. విజయ్ సంకల్పం నెరవేరిందని పేర్కొన్నా రు. అదేసమయంలో ఎన్డీయే కూటమికి కూడా ప్రజలు మద్దతు తెలిపారని.. బీజేపీ తమిళనాడులో బల పడిందని తెలిపారు. తమిళనాడు అభివృద్ధిలో ప్రజల సంక్షేమంలో తాము ఇకపై కీలక పాత్ర పోషించనున్నామని.. అన్ని విధాలా నూతన ప్రభుత్వానికి సహకారం అందిస్తామని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. అదేవిధంగా కేరళలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి కూడా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ఆయన పేరు పెట్టి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం దక్కించుకుంది.

పుదుచ్చేరిలో..

పుదుచ్చేరిలో విజయాన్ని ప్రధాని మోడీ.. సీనియర్ నేత, సీఎం ఎన్‌. రంగ స్వామికే చెందుతుందని చెప్పడం గమనార్హం. ఆయన ఫేస్ వాల్యూకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఎన్ ఆర్‌. కాంగ్రెస్ పార్టీ(రంగస్వామి)+ బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేసి విజయం దక్కించుకున్నాయి. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ఈ కూటమి మేజిక్ ఫిగర్ 16. అయితే.. ఈ కూటమి 18 స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఈవిజయాన్ని రంగస్వామి ఖాతాలో వేయడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu