Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భాగ్యశ్రీకి.. తమిళంలో ఇంకోటి

భాగ్యశ్రీకి.. తమిళంలో ఇంకోటి

Tupaki.com 5 days ago

అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకున్నప్పటికీ.. కొందరు హీరోయిన్లకు అదృష్టం కలిసి రాదు. వరుసగా అవకాశాలు వస్తున్నా.. సినిమాలు హిట్ కావు. ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి ఇదే.

ఇప్పటికే ఆమె తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సినిమాలు చేసింది. అందులో తెలుగులో నటించిన సినిమాలు.. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా. తమిళంలో 'కాంత' అనే సినిమాలో నటించింది. కానీ వీటిలో ఏదీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. మిస్టర్ బచ్చన్ మినహాయిస్తే మిగతా మూడూ పర్వాలేదనిపించే సినిమాలే. కానీ ఆడలేదు.

ఐతే తెలుగులో హ్యాట్రిక్ ఫ్లాపులు కొట్టినా భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగిపోలేదు. 'లెనిన్'లో నటిస్తోంది. మరో సినిమాకు కూడా తన పేరును పరిశీలిస్తున్నారు. తమిళంలో మాత్రం 'కాంత' తర్వాత ఆమెకు బ్రేక్ వచ్చింది. ఐతే ఇప్పుడు భాగ్యశ్రీకి అక్కడా ఇంకో ఛాన్స్ లభించింది. శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరో సరసన భాగ్యశ్రీని కథానాయికగా ఎంచుకున్నారు.

'అమరన్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మరో సినిమా చేస్తున్నాడు. అదే.. సెయాన్. శివ నిర్మాణంలో 'తాయ్ కిళవి' అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇందులో శివ సరసన భాగ్యశ్రీ నటించబోతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయం అధికారికం అయింది.

'తాయ్ కిళవి' తరహాలోనే తన రెండో చిత్రాన్ని కూడా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తీయబోతున్నాడు శివకుమార్. ఇలాంటి చిత్రాల్లో కథానాయికను లంగావోణీలు, చీరల్లో కొంచెం మాస్‌గా చూపిస్తుంటారు. మరి అలాంటి పాత్రలో భాగ్యశ్రీ ఎలా ఒదిగిపోతుందో చూడాలి. 'కాంత' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ కెరీర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె జస్ట్ అందగత్తె కాదని, మంచి పెర్ఫామర్ అని ఈ సినిమాతో రుజువైంది. ఆ టాలెంట్ చూసే శివకార్తికేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu