Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ అమ్ములపొదిలో నిపుణ్ ...విశాఖదే ఘనత

భారత్ అమ్ములపొదిలో నిపుణ్ ...విశాఖదే ఘనత

Tupaki.com 1 week ago

భారత రక్షణ దళానికి మరింత బలాన్ని ఇచ్చే సరికొత్త అస్త్రం సిద్ధం అవుతోంది. నావికా దళంలో చేరే అత్యంత శక్తివంతమైన ఈ రక్షణ నౌకకు నిపుణ్ అని పెరు పెట్టారు.

నిపుణ్ ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. ఇక నిపుణ్ విషయానికి వస్తే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లోతైన సముద్ర డైవింగ్ తో పాటు నీటి అడుగున సహాయక సామర్థ్యాలకు నిపుణ్ ఉపయోగకరంగా ఉంటుందని నావికా దళ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నిర్మాణం నుంచి సమర్ధవంతమైన సేవలను అందించే వరకు సాగే ప్రయాణంలో నిపుణ్ రక్షణ నౌక సరి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. భారత నావికాదళానికి రెండో స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ గా నిపుణ్ అందుబాటులోకి రానుంది. నిస్తార్ క్లాస్ చెందిన నిపుణ్ రక్షణ నౌకను ఈ నెల 31న ముంబై డాక్‌యార్డ్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు.

షిప్ యార్డు తయారీగా :

ఇదిలా ఉండగా నిపుణ్ రక్షణ నౌకను విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ ద్వారా స్వదేశీంగా రూపకల్పన చేశారు. నిపుణ్ రక్షణ నౌకల నిర్మాణంలో దేశ స్వావలంబన సాధించే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన మైలు రాయిగా నావికా దళ అధికారులు చెబుతున్నారు. విస్తృతమైన సరంజామాను నిపుణ్ లో అమర్చారు. అనేక కీలకమైన పరీక్షల కార్యక్రమం పూర్తయిన తర్వాత షిప్ యార్డు అధికారులు నిపుణ్ ని భారత నౌకాదళానికి ఇటీవల అప్పగించారు. నిపుణ్ అనేది విస్తృత శ్రేణి డైవింగ్ తో పాటు జలాంతర్గత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక వేదికగా అభివర్ణిస్తున్నారు. ఈ నౌక ఆధునిక డైవింగ్ వ్యవస్థలు జలాంతర్గత సహాయక సామర్థ్యాలతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నౌక సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పని చేసే డైవర్లకు నిరంతర మద్దతు ఇస్తుంది. అంతే కాదు నిపుణ్ జలాంతర్గత రెస్క్యూ ఆపరేషన్లకు పూర్తిగా సహకరించడంతో పాటు భారత నౌకాదళం సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.

అత్యాధునికంగా డిజైన్ :

ఇక నిపుణ్ రక్షణ నౌకలో నావిగేషన్ ప్లాట్‌ఫారఒ నిర్వహణ కచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం ఆధునిక వ్యవస్థలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వీటికి తోడుగా డైవింగ్, జలాంతర్గత సహాయక చర్యలు, వైద్య సహాయం కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయని ఈ సామర్థ్యాలు సముద్ర ఉపరితలం కింద సంక్లిష్ట కార్యకలాపాల కోసం నిపుణ్‌ ను ఒక సమగ్ర వేదికగా పని చేసేలా చేస్తాయన్నారు. నిపుణ్‌ను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం వల్ల భారత దేశానికి ఆసక్తి ఉన్న సముద్ర ప్రాంతాల్లో ప్రత్యేక డైవింగ్, జలాంతర్గత మిషన్లను చేపట్టే భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్వదేశీంగా నిర్మించిన ఈ రక్షణ నౌకను భారత నౌకాదళంలోకి చేర్చడం, నౌకాదళ కార్యాచరణ అవసరాలకు మద్దతుగా సాంకేతికంగా అధునాతన, ప్రత్యేకమైన నౌకల్ని అందించడంలో దేశ నౌకా నిర్మాణ వ్యవస్థలో పెరుగుతున్న సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.

నీటిలో ఉండే సత్తాతో :

అంతే కాకుండా నిపుణ్ రక్షణ నౌక ఎక్కువసేపు నీటిలో మునిగి ఉండగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన తిమింగలమని అధికారులు అభివర్ణిస్తున్నారు. సవాల్ తో కూడిన లోతైన సముద్ర వాతావరణంలో సుదీర్ఘ డైవింగ్ కార్యకలాపాలకు మద్దతివ్వగల సత్తా దీనికి ఉంది. ఆధునిక డైవింగ్ హెల్మెట్ ఓడ లక్ష్యంలో కీలకమైన డైవర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓడ అందించే అధునాతన డైవింగ్ వ్యవస్థలు, ప్రాణరక్షణ సామర్థ్యాల్ని సూచిస్తుంది. అధిక లోతులలో డైవర్లు సురక్షితంగా, సమర్థవంతంగా పని చేయడానికి వీలు కల్పించడంలో సహాయపడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu