Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్తకు తెలియకుండా కూతురి పెళ్లి.. కోర్ట్ కీలక నిర్ణయం!

భర్తకు తెలియకుండా కూతురి పెళ్లి.. కోర్ట్ కీలక నిర్ణయం!

Tupaki.com 3 days ago

న్నకూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఏ తండ్రికైనా ఉంటుంది. కానీ, భర్తకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా భార్యే స్వయంగా కూతురి పెళ్లి చేసేస్తే?

తాజాగా ఇలాంటి ఓ విచిత్రమైన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్తకు చెప్పకుండా కూతురి పెళ్లి చేయడం అనేది అతనికి తీవ్ర మానసిక క్షోభను కలిగించడమేనని, ఇది ముమ్మాటికీ 'మానసిక వేధింపుల' కిందకే వస్తుందని పేర్కొంటూ సదరు భర్తకు విడాకులు మంజూరు చేసింది.

అసలు ఏం జరిగిందంటే?:

ఈ విడాకుల కేసు కథ 1997లో మొదలైంది. ఆ సంవత్సరంలో ఒక జంటకు వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే కొన్నేళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగినా, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక ముఖ్యంగా 2017 జూన్ నెలలో జరిగిన ఒక సంఘటన తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మరింత పెరిగాయని, అప్పటి నుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారని భర్త కోర్టుకు తెలిపాడు.

డబ్బు కోసమే గొడవలు:

తన భార్య ఎప్పుడూ తన సంపాదన, ఆస్తుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టేదని భర్త కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తన ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ నిరంతరం గొడవ పడేదని ఆరోపించాడు. సంపాదన విషయంలో భార్య ప్రవర్తన వల్ల తాను ఇంట్లో ప్రశాంతతను కోల్పోయానని, అది తనను తీవ్రంగా కలిచివేసిందని అతను న్యాయస్థానానికి వివరించాడు.

తండ్రికి చెప్పకుండానే పెళ్లి:

అయితే అన్నింటికంటే పెద్ద షాక్ ఏంటంటే.. వీరు విడిగా ఉంటున్న సమయంలో భార్య తన కూతురి పెళ్లి నిశ్చయించింది. ఇక ఈ పెళ్లి విషయమై కనీసం తండ్రికి సమాచారం కూడా ఇవ్వలేదు. పెళ్లి వేడుకలకు కూడా అతన్ని ఆహ్వానించకుండా, పూర్తిగా దూరంగా పెట్టి పెళ్లి కానిచ్చేసింది. ఇక కన్నకూతురి పెళ్లికి తండ్రిని కాకుండా చేయడంపై అతను న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు:

ఈ కేసును విచారించిన జస్టిస్ సి.వి. కార్తికేయన్‌, జస్టిస్ కె. రాజశేఖర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం భార్య ప్రవర్తనను తప్పుబట్టింది. ఇక ఒక తండ్రిగా కూతురి పెళ్లిలో భాగస్వామి కాలేకపోవడం, అసలు పెళ్లి జరుగుతున్న విషయమే తెలియకపోవడం అనేది సదరు వ్యక్తికి జీవితాంతం మర్చిపోలేని మానసిక వేదనను మిగులుస్తుందని జడ్జీలు అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్నప్పటికీ, పిల్లల జీవితంలో తండ్రి స్థానాన్ని తీసేయలేమని కోర్టు స్పష్టం చేసింది. భర్తకు చెప్పకుండా పెళ్లి చేయడం ద్వారా భార్య అతన్ని మానసికంగా హింసించిందని కోర్టు తేల్చింది. ఇక ఈ మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకుని, అతనికి విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu