Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్యూటీల స్ట్రాంగ్ రీఎంట్రీ కష్టం కాదు.. కానీ..

బ్యూటీల స్ట్రాంగ్ రీఎంట్రీ కష్టం కాదు.. కానీ..

Tupaki.com 5 days ago

కప్పుడు టాలీవుడ్‌ లో స్టార్ హీరో సినిమా అనగానే హీరోయిన్‌ గా కొందరి పేర్లు ఫిక్స్ అన్నట్టే ఉండేది. ఒక దశలో దర్శకనిర్మాతలకు లక్కీ ఛార్మ్‌ లా మారిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు తెలుగు తెరపై అరుదుగా కనిపిస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

కొత్త హీరోయిన్ల ఎంట్రీ, పాన్ ఇండియా ట్రెండ్, వరుస ఫ్లాపులు వారి కెరీర్ గ్రాఫ్‌ ను మార్చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్పుడు ఆ చర్చలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతి శెట్టి. ముందుగా కీర్తి సురేష్ విషయానికి వస్తే.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మహానటి తర్వాత ఆమె రేంజ్ జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో మరింత బిజీ అవుతారని భావించినా.. పలు ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో కమర్షియల్ రేసులో ఆమె స్పీడ్ తగ్గింది. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలపై కీర్తి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ స్ట్రాంగ్ స్టోరీ, మంచి పాత్ర దొరికితే టాలీవుడ్‌ లో ఆమె మళ్లీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వగలదనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

ఇక పూజా హెగ్డే ఒక దశలో స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌ గా నిలిచింది. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. గ్లామర్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల చేసిన కొన్ని భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమె కెరీర్ కాస్త స్లో అయింది. ప్రస్తుతం బాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలపై పూజా ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. కానీ తెలుగులో ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గలేదని, సరైన సినిమా పడితే మళ్లీ బిజీ హీరోయిన్‌ గా మారే అవకాశం ఉంది.

కృతి శెట్టి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఉప్పెన సినిమాతో వచ్చిన భారీ క్రేజ్ ఆమెను ఒక్కసారిగా స్టార్‌ డమ్‌ కు తీసుకెళ్లింది. వరుస అవకాశాలు, యూత్‌ లో ఫాలోయింగ్ వల్ల కెరీర్ జెట్ స్పీడ్‌ లో వెళ్లింది. కానీ అదే వేగంతో వచ్చిన ఫ్లాపులు కెరీర్‌ పై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కథల ఎంపికలో పొరపాట్లు ఆమెకు మైనస్ అయ్యాయి. ప్రస్తుతం తమిళం, మలయాళ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న కృతి.. అక్కడ మంచి హిట్ సాధిస్తే తిరిగి తెలుగులో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు కొత్త ఫేస్‌ ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే చర్చ సాగుతోంది. పాన్ ఇండియా మార్కెట్ పెరగడం, సోషల్ మీడియాలో కొత్త హీరోయిన్లకు భారీ రీచ్ రావడం వల్ల ఫోకస్ మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్టార్‌ డమ్ అనేది ఒక్క ఫ్లాప్‌ తో ఎండ్ అవ్వదు. నటన, గ్లామర్, ఫ్యాన్ బేస్.. వారికి ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఒక సాలిడ్ హిట్ పడితే మళ్లీ టాలీవుడ్‌ లో అదే క్రేజ్‌ తో రీఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. కానీ సరైన మూవీ మాత్రం పడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu