Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరణ్‌ను చూసి హనుమంతుడి ఫీలింగ్ వచ్చిందన్న బుచ్చిబాబు!

చరణ్‌ను చూసి హనుమంతుడి ఫీలింగ్ వచ్చిందన్న బుచ్చిబాబు!

Tupaki.com 1 week ago

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. జూన్ 4న పెద్ది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో కుస్తీ ఎపిసోడ్స్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ చూపించిన డెడికేషన్ గురించి బుచ్చిబాబు చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను ఎమోషనల్ చేస్తున్నాయి. కుస్తీ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు చరణ్ గారిని చూస్తే హనుమంతుడిని చూసిన ఫీలింగ్ కలిగేదని బుచ్చిబాబు చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ హీరోగా కాకుండా, పాత్ర కోసం తనను పూర్తిగా మార్చుకుని జీవించే నటుడిగా చరణ్‌ను ఆయన అభివర్ణించారు. ఈ సినిమా కోసం చరణ్ కేవలం లుక్ మార్చుకోవడం మాత్రమే కాదు, మానసికంగా కూడా పాత్రలోకి వెళ్లిపోయారని బుచ్చిబాబు వెల్లడించారు.

పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఓ ఆట కూలీ పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో కుస్తీకి ఎంతో ప్రాధాన్యం ఉండటంతో, చరణ్ ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారని సమాచారం. ప్రతిరోజూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ, తన బాడీ లాంగ్వేజ్ నుంచి నడక వరకు పూర్తిగా మార్చుకున్నారు. అంతేకాదు, ఆ కుస్తీ ఫైట్స్ టైమ్ లోనే చరణ్ మాల ధారణ చేయడం వల్ల ఎంతో నిష్టగా ఉంటూ, షూటింగ్‌లో పాల్గొన్నారని, అందుకే ఆ సీక్వెన్స్ లో ఆయన్ని చూస్తే హనుమంతుల వారిని చూసిన ఫీలింగ్ కలిగిందని బుచ్చిబాబు చెప్పారు.

షూటింగ్ టైమ్ లో కూడా చరణ్ ఎలాంటి స్టార్ ఇమేజ్ చూపించకుండా, ఒక సాధారణ నటుడిలా యూనిట్‌తో కలిసిపోయేవారని బుచ్చి తెలిపారు. చిరంజీవి గారి కొడుకు అయ్యుండి ఎందుకింత కష్టపడుతున్నారని అడిగితే, డబ్బులు ఇస్తున్నారు కదా, కష్టపడకపోతే ఎలా? అని చరణ్ చెప్పేవారని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. స్టార్‌డమ్ ఎంత పెద్దదైనా, చేసే పని పట్ల డెడికేషన్ ఇంకా పెద్దదని చరణ్ మరోసారి నిరూపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన పెద్ది పోస్టర్లు, గ్లింప్స్‌లో రామ్ చరణ్ పూర్తిగా కొత్తగా కనిపించారు. రఫ్ లుక్, గడ్డం, గ్రామీణ యాస, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఇవన్నీ ప్రేక్షకులకు ఓ కొత్త చరణ్‌ను పరిచయం చేశాయి. చూస్తుంటే పెద్ది చరణ్ కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎంతో టైమ్ తీసుకుని రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ బిజినెస్ జరుగుతోందని సమాచారం. మరోవైపు, డైరెక్టర్ చెప్పిన చరణ్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు అభిమానుల్లో ఆయనపై మరింత గౌరవాన్ని పెంచుతున్నాయి. స్క్రీన్‌పై మాస్ హీరోగా కనిపించే చరణ్, ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటాడన్న విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu