Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చేపల మార్కెట్‌కి వెళ్లి మాకు నచ్చే చేపలు కొని తెచ్చేది!- జాన్వీ

చేపల మార్కెట్‌కి వెళ్లి మాకు నచ్చే చేపలు కొని తెచ్చేది!- జాన్వీ

Tupaki.com 3 weeks ago

భారతీయ సినీపరిశ్రమలో తనదైన అద్భుత నటన, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తాజాగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి సంచలన విషయాలను షేర్ చేసారు.

ప్రస్తుతం టాలీవుడ్ - బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన తల్లి వారసత్వాన్ని మోయడంపై మనసు విప్పారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి తన తల్లి ఇమేజ్‌తో ఎదురవుతున్న పోలికలు, తన వ్యక్తిగత ఎదుగుదల.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన `పెద్ది` వంటి భారీ చిత్రాలలో నటిస్తున్న తరుణంలో తన ఆలోచనా విధానం ఎలా ఉందో జాన్వీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చిన్నతనంలో తన తల్లి శ్రీదేవి ఎంతటి పెద్ద సూపర్‌స్టారో.. దేశవ్యాప్తంగా మామ్‌కు ఎంతటి క్రేజ్ ఉందో తనకు అస్సలు తెలిసేది కాదని జాన్వీ కపూర్ చెప్పారు. తాము ఎంత పెద్ద స్టార్ ఫ్యామిలీకి చెందినవారమైనా ఇంట్లో మాత్రం సినిమా వాతావరణాన్ని తల్లి ఎప్పుడూ దూరంగానే ఉంచేదని.. ఒక సాధారణ తల్లిలాగే తమను చూసుకునేదని వెల్లడించారు. మాకు అమ్మ సూపర్‌వుమన్ ఎందుకు అంటే.. ప్రతి శుక్రవారం ఫిష్ మార్కెట్‌కు వెళ్లి వంటకు ఏ రకం ఫిష్ బాగుంటుందో స్వయంగా ఎంపిక చేసి తీసుకురావడం. ఆ పనులన్నీ చేయడంలో అమ్మ ఎంతో గర్వంగా, సంతోషంగా ఫీల్ అయ్యేది! అని జాన్వీ తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

తాను స్వయంగా నటనా రంగంలో అడుగుపెట్టి నటిగా పని చేయడం ప్రారంభించాకనే.. అసలు తన తల్లి ప్రేక్షకులకు ఎంతటి ఆరాధ్య దైవమో.. వారి జీవితాల్లో ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉందో పూర్తిగా అర్థం కావడం ప్రారంభమైందని జాన్వీ అన్నారు. వెండితెరపైనే కాకుండా.. సాధారణ ప్రజల మనసుల్లో శ్రీదేవి పై ఉన్న అపారమైన ప్రేమాభిమానాల గురించి తెలుసుకోవడం ఒక గొప్ప బ్లెస్సింగ్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి అపారమైన ప్రజాదరణ తరాలకోసారి.. ఎప్పుడో ఒకసారి మాత్రమే సాధ్యమవుతుందని.. తన తల్లి సృష్టించిన ఆ మ్యాజిక్‌ను మళ్లీ రీ-క్రియేట్ చేయడం ఎవరికైనా దాదాపు అసాధ్యమని జాన్వీ స్పష్టం చేశారు.

సినిమా రంగంలో తనను నిరంతరం తల్లి శ్రీదేవితో పోల్చడంపై జాన్వీ కపూర్ ఎంతో మెచ్యూర్డ్‌గా సానుకూల దృక్పథంతో స్పందించారు. చిత్ర పరిశ్రమలో ఎవరినో ఒకరితో పోల్చడం చాలా సహజమైన విషయమేనని జాన్వీ పేర్కొన్నారు. నన్ను భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్‌తో పోలుస్తున్నప్పుడు.. నేను దానిని ఒక అదృష్టంగా భావిస్తాను. ఆ పోలికలు నన్ను మరింత కష్టపడటానికి నా నటనను ప్రతి సినిమాకు మెరుగుపరుచుకోవడానికి ఒక గొప్ప ఎనర్జీని, మోటివేషన్‌ను ఇస్తాయి తప్ప అందులో ఎలాంటి నెగిటివిటీ లేదు! అని జాన్వీ చాలా స్పష్టంగా వివరించారు.

ప్రస్తుతం తాను ఏ సినిమా చేసినా పూర్తి స్థాయి నిజాయితీతో చేస్తున్నానని.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టార్ కిడ్ అనే ట్యాగ్ ..శ్రీదేవి ఇమేజ్ తెచ్చే ఒత్తిడిని నెగిటివ్‌గా తీసుకోకుండా తన కెరీర్‌కు అదొక ఇంధనంగా మార్చుకున్నానని జాన్వీ కపూర్ చెప్పిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, మునుముందు నటిగా మరిన్ని శిఖరాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చరణ్‌- జాన్వీ జంటగా నటించిన పెద్ద జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu