Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధనుష్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు

ధనుష్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు

Tupaki.com 1 hr ago

కోలీవుడ్ లో ఈ ఏడాది దీపావళి సీజన్‌పై ఇప్పటి నుంచే ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. ఒకే పండగ సీజన్‌లో ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిసి బాక్సాఫీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా సూర్య 47, ధనుష్ నటిస్తున్న ఓం: చాప్టర్1- ఉదిరమ్ మధ్య మధ్య పోటీ ఎలా ఉండబోతుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సూర్య సినిమాకు కాస్త పైచేయి ఉందనే అభిప్రాయం కనిపిస్తున్నా.. ధనుష్ సినిమాను మాత్రం ముందుగానే రేసు నుంచి తప్పించడం లేదా అతని సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది.

ధనుష్ కెరీర్‌లో రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, నటుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికితే తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు అదనపు బలం తీసుకురాగల హీరోగా ధనుష్‌కు పేరుంది. అందుకే గత ఫలితాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ దీపావళి పోటీలో ఆయన సినిమాకు తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పడం తొందరపాటు నిర్ణయమే అవుతుంది.

ఇక్కడ అసలు కీలకమైన అంశం కంటెంట్. పండగ సీజన్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించడం ఒక విషయం అయితే.. ఫస్ట్ డే తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ను నిలబెట్టుకోవడం మరో విషయం. సినిమా బాగుందనే టాక్ వస్తే మొదట అంచనాల్లో వెనుకబడిన సినిమా కూడా వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్టార్ హీరోకు ఉన్న మార్కెట్‌కు తోడు పాజిటివ్ మౌత్ టాక్ కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోవచ్చు.

ఇదే ధనుష్ సినిమాకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఛాన్స్. మొదటి రోజు ఎవరు ముందుంటారనే దానికంటే, మూడు నాలుగు రోజుల్లో ప్రేక్షకులు ఏ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారనేదే అసలు ప్రశ్నగా మారవచ్చు. మంచి కంటెంట్ దొరికితే ధనుష్ సినిమా అండర్‌డాగ్ స్థాయి నుంచి నేరుగా పోటీదారుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు ఈ పోటీని కేవలం సూర్య వర్సెస్ ధనుష్‌గా చూడటం కూడా సరైంది కాదు.

రెండు సినిమాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే దీపావళి సీజన్ మొత్తం తమిళ బాక్సాఫీస్‌కు లాభదాయకంగా మారుతుంది. ఎక్కువ షోలు, మెరుగైన ఆక్యుపెన్సీ, ఫ్యామిలీ ఆడియన్స్ రాకతో థియేట్రికల్ మార్కెట్‌కు పండగ కళ రావచ్చు. కాబట్టి ప్రస్తుత అంచనాల్లో సూర్యకు స్వల్ప ఆధిక్యం ఉన్నా.. ధనుష్ సినిమాకు సడన్‌గా గేమ్ మార్చే ఛాన్స్ లేకపోలేదు. చివరికి స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్, ఆడియన్స్ రెస్పాన్సే ఈ దీపావళి విన్నర్‌ను డిసైడ్ చేయబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu