Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ది ఒడెస్సీ: అన్ని విమర్శలకు నోలాన్ బిగ్ రిటార్ట్ ప్లాన్

ది ఒడెస్సీ: అన్ని విమర్శలకు నోలాన్ బిగ్ రిటార్ట్ ప్లాన్

Tupaki.com 1 week ago

రాజులు- రాజ్యాలు.. కోటలు- ఘడీలు.. ఇవన్నీ అంతరించిపోయిన కాలానికి చెందిన సాక్ష్యాలు. అయినా ఇప్పటికీ ఇవి ఫిలింమేకర్స్ ఎంపిక చేసుకునే స్క్రిప్టులకు ముడి వస్తువులు.

పురాణేతిహాస కథలతో రూపొందించిన యాక్షన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతుందని ట్రాయ్, గ్లాడియేటర్, 300 యోధులు వంటి సినిమాలు నిరూపించాయి. వీటి స్ఫూర్తితోనే ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి, బాహుబలి 2 చిత్రాలను రూపొందించి పెద్ద సక్సెసయ్యారు. ఆయన ఇండియన్ సినిమా భవిష్యత్ నే దిశానిర్ధేశనం చేయడం ఒక సంచలనం. ఈ సినిమాల్లో పురాణ కథలకు రాజుల కథలను జోడించి స్క్రిప్టు రచయితలు చాలా మ్యాజిక్ చేసారు.

అయితే నోలాన్ లాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేం. ఆయన తెరకెక్కించిన ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాలను చూసినప్పుడు అతడు రెగ్యులర్ ప్రపంచానికి చాలా దూరంగా ఊహిస్తాడని అంతా భావిస్తారు. కానీ దానికి భిన్నంగా ఓపెన్ హీమర్ లాంటి ఒక అణుశాస్త్ర వేత్త బయోపిక్ కథతోను మెప్పించారు. అందుకే ఇప్పుడు అతడు ఎంపిక చేసుకున్న భిన్నమైన జానర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పురాణేతిహాసాలకు భారీ యాక్షన్ ని బ్లెండ్ చేసి నోలాన్ చేస్తున్న ప్రయోగం ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలనే ఉత్సాహం అందరిలోను ఉంది.

దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన తదుపరి భారీ చిత్రం `ది ఒడెస్సీ`తో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రాచీన గ్రీకు పురాణ గాథను తనదైన శైలిలో సినిమాగా మలుస్తున్న నోలన్ ఈ చిత్రం కోసం మొదటిసారి పౌరాణిక యాక్షన్ ఎపిక్ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో రాపర్ ట్రావిస్ స్కాట్‌ను ఒక ప్రాచీన కథకుడి పాత్రకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చినా నోలన్ వాటిని సమర్థించుకున్నారు. గ్రీకు పురాణాలు ఒకప్పుడు నోటి ద్వారా వినిపించే కవిత్వంలా ఉండేవని.. దానికి నేటి `రాప్` సంగీతం ఒక సమాంతర రూపమని ఆయన ఇచ్చిన వివరణ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ చిత్రం ద్వారా నోలన్.. నటుడు మాట్ డామన్ మూడవసారి కలిసి పని చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఇంటర్‌స్టెల్లార్ , ఓపెన్‌హైమర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ వసూళ్లను సాధించాయి. ఈ క్రమంలో ది ఒడెస్సీ` లో మాట్ డామన్ ప్రధాన పాత్ర అయిన ఒడిస్సియస్` గా కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ఈ ఒక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించినా.. నోలన్-డామన్ జోడీ మొత్తం బాక్సాఫీస్ రికార్డు 2 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.

సినిమాలోని తారాగణం కూడా అత్యంత భారీగా ఉండటం విశేషం. మాట్ డామన్‌తో పాటు టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా వంటి గ్లోబల్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పటికే జనవరిలో విడుదలైన టీజర్ ట్రైలర్‌లో ట్రావిస్ స్కాట్ ట్రోజన్ యుద్ధం గురించి చెబుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదివరకే టెనెట్` సినిమా కోసం నోలన్ - ట్రావిస్ స్కాట్ కలిసి పనిచేసి ఉండటంతో వీరిద్దరి మధ్య ఉన్న సింక్ ఈ చిత్రంలోని కథనానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu