Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దృశ్యం 3 లో నర్స్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

దృశ్యం 3 లో నర్స్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Tupaki.com 2 weeks ago

దువుకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీలు.. ముఖ్యంగా సాయి పల్లవిని మొదలుకొని శ్రీలీల వరకు ఇలా కొంతమంది హీరోయిన్లు ఒకవైపు సెట్లో సందడి చేస్తూనే..

మరొకవైపు అదే సెట్ లో విరామం దొరికితే పుస్తకాలతో కుస్తీలు పడి నేడు పట్టభద్రులు అవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది డిగ్రీలు, బీటెక్లు చేసి సినిమా రంగంలోకి అడుగుపెడితే.. మరికొంతమంది ఎంబీబీఎస్ ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలో నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇక ఇలా సినిమాలలో నటిస్తూ మరొకవైపు తమ వైద్య విద్యను పూర్తి చేస్తున్నారు

అలాంటి వారిలో శ్రీ లీలా కూడా ఒకరు. తన అద్భుతమైన నటనతో, మాస్ స్టెప్పులతో తెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఎంబిబిఎస్ లో డిగ్రీ పట్టాను కూడా అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో బ్యూటీ కూడా చేరిపోయింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి.. తెరపై తన ముద్దుముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత పలు యాడ్స్ లో కూడా నటించింది. ఒకవైపు సీరియల్స్ , మరొకవైపు వాణిజ్య ప్రకటనలలో కనిపించి తన ప్యాషన్ నిరూపించుకున్న ఈమె.. చదువు, సినిమా రెండూ కావాలి అంటూనే వైద్య విద్యను పూర్తి చేసింది.

ఇప్పుడు నటిగా అవతరించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని అలరిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా దృశ్యం3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ హిట్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ లాల్, ఎస్తేర్ అనిల్, మీనా, కళాభవన్ సజోన్ , సిద్ధిక్, మురళి గోపి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేవలం 58 గంటల్లో 100 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఏడు రోజుల్లో 200 కోట్లు రాబట్టి ఫ్రాంచైజీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో నర్సు పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది శ్రద్ధా గోకుల్.

ఇక ఈ సినిమాలో నర్స్ గా కనిపించి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెంట్స్ తో శ్రేయ పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. నిజ జీవితంలో డాక్టర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం లో వచ్చిన హలో కుట్టి చేతన్ సీరియల్ ద్వారా చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రద్ధా సూపర్ డాన్సర్ జూనియర్ అనే డాన్సర్ రియాల్టీ షోలో పాల్గొని తన టాలెంట్ తో జడ్జెస్ ను మెప్పించింది. అటు డాన్స్ ఇటు నటన రెండింటిలో కూడా మంచి గుర్తింపు అందుకోవడంతో సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి.

వాస్తవానికి సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా నటన కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కొంత కాలం యాక్టింగ్ కి దూరం అయింది. అలా ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ పూర్తి చేసిన ఈమె.. కేరళలోని తిరువనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్షిప్ పూర్తి చేసింది. ఇక డాక్టర్ గానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నటనకు దూరం కావాలనుకుంది. అయితే ఒకసారి కొచ్చిలో జరిగిన ఒక ఆడిషన్ కి అనుకోకుండా హాజరు కావడంతో ఆమె జీవితం మళ్లీ మలుపు తీసుకుంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ తన మూవీ వళతు వశతే కల్లాన్ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇందులో మంచి గుర్తింపు రావడంతో మళ్లీ దృశ్యం 3లో ఆమెకు అవకాశం కల్పించారు.. ఇక్కడ కూడా ఆమె అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలని ఉంది అని అందుకోసం ప్రిపేర్ అవుతున్నానని కూడా తెలిపింది. అలా ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరొకవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తానని తెలిపింది శ్రద్ధా. ఏది ఏమైనా ఈమె పట్టుదలకు, కృషికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu