Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ మిస్ యూజ్: అసలు సమస్య ఎక్కడ ఉందంటే..

ఏఐ మిస్ యూజ్: అసలు సమస్య ఎక్కడ ఉందంటే..

Tupaki.com 1 week ago

డిజిటల్ వరల్డ్ లో ఇప్పుడు ఒకరి ఫోటోలు, ముఖాలు మార్చేసి ఫేక్ వీడియోలు చేయడం ఒక పెద్ద తలనొప్పిగా మారింది. రీసెంట్ గా కొంతమంది నటీనటులు తమ ఇమేజ్ పాడవ్వకుండా ఉండటానికి కోర్టుల వరకు వెళ్లారు.

అయితే లీగల్ గా ఆర్డర్లు తెచ్చుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ నిజంగా సాల్వ్ అవుతుందా అంటే చాలామందిలో ఒక కొన్ని సందేహాలు వస్తున్నాయి. అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏఐ టూల్స్ తయారు చేసిన కంపెనీలదే అసలు తప్పు అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

పర్ఫెక్ట్ గా సాఫ్ట్ వేర్ డిజైన్ చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా వాడేలా మార్కెట్ లోకి వదిలేశారు. ఆయుధం చేతిలో ఇచ్చేసి దాన్ని క్రైమ్స్ కి వాడొద్దు అంటే వినే రోజులు కావు ఇవి. ఆయా కంపెనీలు తమ లాభాల కోసం సెక్యూరిటీని పక్కన పడేయడమే ఈ పరిస్థితికి కారణం. దీనికి తోడు సోషల్ మీడియా కంపెనీలకు కూడా ఈ ఫేక్ కంటెంట్ వల్ల లాభమే జరుగుతోంది. ఏదైనా కాంట్రవర్సీ ఉన్న వీడియో బయటకు వస్తే చాలు జనాలు విపరీతంగా చూస్తారు, షేర్లు చేస్తారు.

దీనివల్ల ఆ సైట్లకు వ్యూస్ పెరిగి బాగా డబ్బులు వస్తాయి. అందుకే ఇలాంటి ఫేక్ పోస్టులను వెంటనే పసిగట్టి డిలీట్ చేసే గట్టి సిస్టమ్ ని వాళ్ళు సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక కోర్టులు ఆర్డర్లు ఇచ్చినా ఇంటర్నెట్ లో దాన్ని ఆపడం చాలా కష్టం. ఒక చోట ఆ వీడియో తీసేస్తే, ఇంకో పది వేరే అకౌంట్ల నుంచి మళ్ళీ అప్లోడ్ అవుతుంది. పైగా వేరే దేశాల నుంచి నడిచే సైట్లను మన దేశపు రూల్స్ ఏమీ చేయలేవు. అందుకే లీగల్ గా ఆర్డర్లు తెచ్చుకున్నా సరే, ఆ వీడియోలు మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూనే ఉంటాయి.

ఈ సెలబ్రిటీల దగ్గర డబ్బులు, పీఆర్ టీమ్స్ ఉంటాయి కాబట్టి లాయర్లను పెట్టి కేసులు వేసుకోగలరు. కానీ రేపు పొద్దున ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే అమ్మాయి ఫోటోలను ఇలా మార్చేస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె కోర్టులకు తిరిగేంత ఖర్చు భరించలేదు. అలాంటప్పుడు సామాన్యుల ప్రైవసీకి అసలు రక్షణే లేకుండా పోతుంది.

కాబట్టి కేవలం కోర్టు తీర్పుల మీద ఆధారపడితే ఈ సమస్య తీరదు. ఏఐ టూల్స్ క్రియేట్ చేసేటప్పుడే ప్రైవసీ విషయంలో బలమైన కొత్త కోడింగ్ తీసుకురావాలి. టెక్నాలజీతో వచ్చిన ఈ తిప్పలను మళ్ళీ సేఫ్టీ టెక్నాలజీతోనే ఆపాలి తప్ప, కేవలం కోర్టు కేసులతో ఈ ఫేక్ వీడియోల గొడవ ముగిసిపోదు. ఇక సెలబ్రిటీలు అయితే ఎప్పటి లేని కోట్ల వరకు తరచుగా వెళుతున్నారు. మరి భవిష్యత్తులో ఎఐ డీప్ ఫేక్ గొడవలు ఏ స్థాయికి వెళతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu