Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఈ నగరానికి ఏమైంది 2' రిలీజ్ డేట్ ఫైనల్.. సీక్వెల్ హిట్ కొడుతుందా?

'ఈ నగరానికి ఏమైంది 2' రిలీజ్ డేట్ ఫైనల్.. సీక్వెల్ హిట్ కొడుతుందా?

Tupaki.com 1 week ago

టాలీవుడ్ కల్ట్ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్ వస్తోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 'ఈఎన్ఈ రిపీట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కార్లో నలుగురు ఫ్రెండ్స్ వెళ్తున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియోతో మొదలైన ఈ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు ఎండింగ్ వీడియో తో ముగిసింది. ఇది సోషల్ మీడియాలో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ విశేషాలు చూద్దాం..

షూటింగ్ పూర్తయింది - నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్:

'ఈ నగరానికి ఏమైంది 2' సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం ఒక ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. "దట్స్‌ ఎ ర్యాప్‌ ఆన్‌ వన్‌ సైడ్‌… సీ యు ఆన్‌ ది అదర్‌ సైడ్‌ ఆన్‌ నవంబర్‌ 19" అంటూ నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ నేచర్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తూ చేసిన వీడియో అనౌన్స్‌మెంట్ యూత్‌లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

సీక్వెల్‌లో నటించే నటీనటులు - కొత్త కాంబినేషన్:

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సినిమాల్లో కనిపించే సహజమైన పాత్రలు, ఫ్రెండ్‌షిప్, ఫన్ ఆధారంగా ఈ సీక్వెల్‌ను కూడా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, మాగంటి శ్రీనాథ్, వెంకటేష్ కాకుమానుతో పాటు అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగంలో ఉన్న నటులతో పాటు ఈ సీక్వెల్‌లో కొన్ని సరికొత్త పాత్రలు కూడా వచ్చి చేరడం విశేషం.

టెక్నికల్ టీమ్ అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్:

గతంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' ఆల్బమ్ ఎంతటి పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సీక్వెల్‌కు కూడా వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అజ్ ఆరోన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, రవి తేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్రబృందం పంచుకున్న వీడియోలో వారి ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో 'ఈఎన్ఈ 2' బజ్:

'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలోని వన్-లైనర్లు, కామెడీ డైలాగులు నేటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు పార్ట్-2 వస్తుందనే సరికి సోషల్ మీడియాలో సినిమా లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడున్న టాలీవుడ్ సీక్వెల్స్‌లో 'ఈఎన్ఈ 2'పై ఫాన్స్ లో ఎక్కువ ఆసక్తి ఉంది.

యూత్‌ను థియేటర్లకు రప్పించే సరైన ఫ్రెండ్‌షిప్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'ఈఎన్ఈ రిపీట్' నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. తరుణ్ భాస్కర్ మార్క్ మేకింగ్, వివేక్ సాగర్ మ్యూజిక్ కలగలిసి వస్తున్న ఈ సినిమా నవంబర్ 19న థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu