Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. లాజిక్ ఉందా?

ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. లాజిక్ ఉందా?

Tupaki.com 3 days ago

న్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన డ్రాగన్ గ్లింప్స్ ఒకవైపు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఒక కొత్త గొడవ మొదలైంది.

ప్రశాంత్ నీల్ టేకింగ్, తారక్ లుక్ పై ప్రశంసలు కురుస్తున్న వేళ, ఒక వర్గం నెటిజన్లు మాత్రం ఒక నెగెటివ్ పాయింట్ ను హైలెట్ చేస్తున్నారు. అదే ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్. ప్రస్తుతం ఈ టాపిక్ మీద నెట్టింట భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి.

నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం.. తారక్ తన గత చిత్రాల్లో వాడిన అదే డీప్ బేస్ వాయిస్ ను ఈ గ్లింప్స్ లోనూ రిపీట్ చేశాడనేది ఒక వర్గం ఆడియన్స్ ప్రధాన విమర్శ. ప్రతి సినిమాలోనూ ఒకే రకమైన మాడ్యులేషన్ వినిపిస్తోందని, అందులో ఎలాంటి కొత్తదనం లేదని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ డైలాగ్స్ లో కనిపించే నాచురల్ ఎమోషనల్ వేరియేషన్ ఇప్పుడు మిస్ అయిందని, కేవలం గంభీరంగా మాట్లాడటం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారనేది వాళ్ళ వాదన.

కానీ ఇక్కడ వాస్తవం మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ కు ఉన్న అతిపెద్ద ఆయుధం ఆ బేస్ వాయిస్, ఆయన స్పష్టమైన డిక్షన్. అసలు మెజారిటీ అభిమానులు ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు కోరుకునేది కూడా అదే. థియేటర్లలో ఆ గంభీరమైన స్వరం వినిపిస్తేనే ఫ్యాన్స్ కు అసలైన కిక్ వస్తుంది. తన అద్భుతమైన ప్రతిభతో ఎన్నో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసిన తారక్ వాయిస్, ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక నటుడి నుంచి ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఆశించడం ప్రేక్షకుల వైపు నుంచి చూస్తే తప్పు కాదు. కానీ అదే సమయంలో ఆ కొత్తదనం తీసుకున్న కంటెంట్ కు సెట్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి. డ్రాగన్ అనేది ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే డార్క్ స్టోరీ. అందులో తారక్ ఆఫ్ఘన్ కంపెనీకి చెందిన ఒక కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ పాత్రలో నటిస్తున్నారు. శవాల గుట్టల మధ్య నిలబడి శత్రువులకు వార్నింగ్ ఇచ్చే లుగర్ క్యారెక్టర్ కు ఆ బేస్ వాయిస్ ఉంటేనే కరెక్ట్ గా ఎలివేట్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu