Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎవరీ సతీశన్‌.. కేరళలో బలమైన నేత ఎలా అయ్యారు?

ఎవరీ సతీశన్‌.. కేరళలో బలమైన నేత ఎలా అయ్యారు?

Tupaki.com 5 days ago

కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సతీశన్‌.. ఎవరు? ఆయన ద్వారా రాష్ట్రానికి జరిగే మేలేంటి? ఇదీ.. ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ముగ్గురు కీలక నేతలు పోటీ పడిన కేరళ ముఖ్యమంత్రి స్థానా నికి కాంగ్రెస్ అధిష్టానం అతి కష్టం మీద సతీశన్‌ను ఎంపిక చేసింది.

అయితే.. ఆయన ఎంపిక వెనుక.. బలైమన ఐయూఎంఎల్‌(కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి) ఉందన్నది నిజం. ఈ నేతల ఒత్తిడితోనే వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు.

ఈ క్రమంలో సతీశన్ బలాబలాలు ఏంటి? ఆయన ఏవిధంగా కూటమిని మెప్పించగలర్నది కూడా ప్రశ్న. వీడీ సతీశన్‌.. కాంగ్రెస్ నాయకుడు. 2001 నుంచి ఇప్పటి వరకు ఆయన వరుస విజయాలు అందుకున్నా రు. ఎక్కడా ఓటమి అనేది చవిచూడని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇదొక్కటే ప్రామాణికం కాదు. రాజకీయాల్లో ఏం చేయకూడదో దానికి దూరంగా ఉన్నారు. ఏం చేయాలో అదే చేశారు. పార్టీలు వేరైనా.. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా సతీశన్‌కు పేరుంది.

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాదిరిగా వ్యక్తిగత విమర్శలకు సతీశన్ దూరంగా ఉన్నారు. ఎక్కడా నోరు జారరు. విధానపరమైన నిర్ణయాలు.. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను మాత్రమే ఎండగడతారు. ప్రజ ల సమస్యలు ఎక్కడున్నా.. నేనున్నానంటూ వాలిపోతారు. మరీ ముఖ్యంగా సామాజిక వర్గాల ఐక్యతకు సతీశన్ ఎంతో కృషి చేశారు. ఇది ఆయనకు అన్ని సామాజిక వర్గాలుచేరువ అయ్యేందుకు దోహద పడిం ది. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా బాటలు పరిచింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకంటే కూడా.. యూడీఎఫ్ కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. ఐయూఎంఎల్ బలమైన ఓటు బ్యాంకును పెంచడంలోనూ.. ఆయన సాయం చేశారు. ముస్లింమైనారిటీవర్గాలకు కూడా సతీశన్ చేరువ అయ్యారు. తన జీవితాన్ని పేదలకు.. అంకితం చేశానని ప్రకటించిన ఆయన.. ఇప్పటికీ తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలోనే ఉంటారు. ఇంటి ముఖం చూసి.. 10 సంవత్సరాలు అయిందని అంటారు. అందుకే.. సతీశన్ కోసం.. ప్రజలు నిలబడ్డారు. కాగా.. ప్రస్తుతం 14 మంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu