Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫాఫా చాలా కామ్‌గా కనిపిస్తారు.. కానీ అసలు విషయం వేరే: మైత్రీ రవి

ఫాఫా చాలా కామ్‌గా కనిపిస్తారు.. కానీ అసలు విషయం వేరే: మైత్రీ రవి

Tupaki.com 4 days ago

'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగు రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ రవి సినిమా గురించి కొన్ని లెక్కలు బయటపెట్టారు. ఈ చిత్రాన్ని మలయాళ వెర్షన్‌లో నైజాంలో రిలీజ్ చేసినప్పుడు దాదాపు రూ.60 లక్షల గ్రాస్ వచ్చిందని చెప్పారు.

ఒక మలయాళ సినిమాకు నైజాంలో ఇది చిన్న నంబర్ కాదని అన్నారు. ఇక్కడి ప్రేక్షకుల్లో సినిమాకు రీచ్ రావడంతో తెలుగులో కూడా డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.

మలయాళంలో ఈ సినిమా చేసిన బాక్సాఫీస్ రన్‌ను రవి 'ఇరుముడి'తో పోల్చారు. అక్కడ 'బెత్లెహెం కుడుంబ యూనిట్' రూ.200 కోట్ల వరకు వెళ్లిందని చెప్పారు. తెలుగులో 'ఇరుముడి' ఎంత సెన్సేషన్ చేసిందో, మలయాళంలో ఈ సినిమా కూడా అంతే స్థాయిలో వెళ్లిందని అన్నారు. రెండు సినిమాల మార్కెట్లు వేరైనా, అక్కడ వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పడానికి 'ఇరుముడి' ఉదాహరణ అని వివరణ ఇచ్చారు.

'ఇరుముడి' రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఈ సినిమాను తెలుగులో తీసుకురావడం కూడా తనకు సంతోషంగా ఉందని రవి చెప్పారు. ఒకవైపు రవితేజ సినిమా ఇక్కడ మంచి రన్‌లో ఉండగా, మరోవైపు మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. 'బెత్లెహెం కుడుంబ యూనిట్' తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

ఇక ఫహాద్ ఫాజిల్ గురించి మాట్లాడేటప్పుడు రవి మరో ఫన్నీ విషయం చెప్పారు. బయటకు చూస్తే ఫహాద్ చాలా అమాయకంగా, కామ్‌గా కనిపిస్తారని అన్నారు. కానీ నిజంగా ఆయన వ్యక్తిత్వం అలా ఉండదని చెప్పారు. గత ఏడాది లేదా ఈ ఏడాది ఫిబ్రవరిలో కొచ్చిన్ వెళ్లినప్పుడు ఫహాద్ తమ కోసం ఒక చిన్న పార్టీ హోస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆ పార్టీ సమయంలో ఫహాద్ పూర్తిగా వేరేలా కనిపించారట. రాత్రంతా చాలా ఎనర్జిటిక్‌గా, వైబ్రెంట్‌గా ఉంటూ అందరితో కలిసి సరదాగా గడిపారని రవి చెప్పారు. బయట కనిపించే సైలెంట్ లుక్ చూసి ఆయన కూడా అలానే ఉంటారని అనుకుంటే అది కరెక్ట్ కాదని నవ్వుతూ అన్నారు. ఆ రోజు తమను బాగా చూసుకున్నందుకు ఫహాద్‌కు స్టేజ్ మీదే థ్యాంక్స్ చెప్పారు.

ఫహాద్ వ్యక్తిత్వానికి ఆయన సినిమాలను కూడా రవి పోల్చారు. బయటకు ఆయన సినిమాలు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాయని, కానీ బాక్సాఫీస్ దగ్గర చేసే రికార్డ్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయని అన్నారు. 'బెత్లెహెం కుడుంబ యూనిట్' కూడా మలయాళంలో అలాంటి ఫలితమే అందుకుందని చెప్పారు. ఇప్పుడు అదే సినిమాతో ఫహాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, ఈ రిలీజ్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని మైత్రీ రవి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu