Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గర్భవతిగా ఉన్నా? కఠినమైన షెడ్యూల్!

గర్భవతిగా ఉన్నా? కఠినమైన షెడ్యూల్!

Tupaki.com 1 week ago

బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొనే వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నా దీపిక కెరీర్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

తాజాగా షారుఖ్ ఖాన్‌తో కలిసి నటిస్తోన్న `కింగ్` సినిమా షూటింగ్ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లిన దీపిక అక్కడ అత్యంత కఠినమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని విజయవంతంగా భారత్‌కు తిరిగి వచ్చారు. సాధారణంగా గర్భ ధారణ సమయంలో సుదూర ప్రయాణాలు చేయడం అదీ కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొనడం శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని.

కానీ దీపిక మాత్రం దక్షిణాఫ్రికాలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పాత్రకు పూర్తి న్యాయం చేశారు. `కింగ్` సినిమా షూటింగ్ షెడ్యూల్ ఎంతో టఫ్ అని తెలిసినా ఎక్కడా అసౌకర్యానికి లోనుకాకుండా సన్నివేశాలను పూర్తి చేయడం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచింది. దీపికలోని పట్టుదల నేటి తరం నటీమణులకు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. దీపిక ఇలా గర్భవతిగా ఉండి షూటింగ్‌లో పాల్గొనడం ఇది రెండవసారి కావడం విశేషం. తొలిసారి గర్భం దాల్చిన సమయంలో కూడా ఇదే తరహాలో దీపిక వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించారు.

ఆనాటి అనుభవం ఇప్పుడామెకు ఎంతో తోడ్పడింది. గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పులను, అలసటను తట్టుకుంటూనే కెమెరా ముందుకు వచ్చి పర్ఫెక్ట్ షాట్స్ ఇవ్వడం ఆమెకు అలవాటుగా మారింది. అందుకే `కింగ్` కఠినమైన షెడ్యూల్‌ను కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలిగారు. ఈ ప్రయాణంలో దీపికాకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. షూటింగ్ స్పాట్‌లో దీపికాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షారుఖ్ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

గర్భవతికి అవసరమైన వైద్య సదుపాయాల నుండి ప్రత్యేక ఆహారం వరకు అన్ని సౌకర్యాలను సెట్స్‌లో అందుబాటులో ఉంచారు. నటుడిగానే కాకుండా మంచి మిత్రుడిగా షారుఖ్ అందించిన తోడ్పాటు వల్లే తాను ఈ టఫ్ షెడ్యూల్‌ను సునాయాసంగా పూర్తి చేయగలిగానని దీపికా సన్నిహిత వర్గాల సమాచారం. దక్షిణాఫ్రికా ముగిసినా? దీపికాకు విశ్రాంతి దొరికేలా లేదు. త్వరలోనే తదుపరి చిత్రం `రాకా`షూటింగ్‌లో కూడా జాయిన్ కావాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నా ప్రాజెక్టులు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో దీపిక నిరంతరం శ్రమిస్తున్నారు.

`కింగ్`, `రాకా` వంటి భారీ చిత్రాల్లో దీపిక పోషిస్తున్న పాత్రలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో మధుర క్షణాలను ఆస్వాదిస్తూనే వృత్తిని దైవంగా భావించే అమ్మడి తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీపిక మాతృత్వం - కెరీర్ మధ్య చక్కని సమతుల్యతను పాటిస్తున్నారు. ఓవైపు ఇంటి మహాలక్ష్మి రాక కోసం ఎదురుచూస్తూనే మరోవైపు వెండితెరపై తన ముద్రను పదిలం చేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu