Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లామర్‌కు గౌరవం.. రాశీ ఖన్నా ఆ అవార్డ్స్ సొంతం..

గ్లామర్‌కు గౌరవం.. రాశీ ఖన్నా ఆ అవార్డ్స్ సొంతం..

Tupaki.com 1 week ago

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రాశీ ఖన్నా అటు సినిమాలతో, ఇటు తన అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.

తాజాగా జీ తెలుగు నిర్వహించిన ప్రతిష్టాత్మక 'అప్సర అవార్డ్స్' వేడుకలో రాశీ ఖన్నా తన నటనకు మరియు గ్లామర్‌కు గాను 'దివా ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' అవార్డును సొంతం చేసుకుంది. ఈ వేడుకలో ఆమె ధరించిన రెడ్ శారీ లుక్ మరియు లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ విశేషాలు చూద్దాం..

రెడ్ హాట్ శారీలో రాశీ మాయ:

మహిళా శక్తిని, ప్రతిభను గౌరవిస్తూ జీ తెలుగు నిర్వహించిన అప్సర అవార్డుల కార్యక్రమంలో రాశీ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుక కోసం ఆమె డిజైనర్ శ్రియా ఖన్నా రూపొందించిన మోడ్రన్ క్రిమ్సన్ రెడ్ ప్రీ-డ్రేప్డ్ శారీలో మెరిసిపోయింది. ప్రత్యేకమైన స్ట్రక్చర్డ్ ప్లీట్స్, హై-నెక్ బ్లౌజ్ మరియు డ్రామాటిక్ రఫుల్డ్ కేప్ పల్లుతో ఉన్న ఈ డ్రెస్‌లో రాశీ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇక సెలబ్రిటీ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ డిజైన్ చేసిన ఈ రాయల్ లుక్‌కు మ్యాచింగ్ జ్యువెలరీ యాడ్ అవ్వటం తో రాశీ దేవకన్యలా మెరిసిపోయింది.

అవార్డు రావడంపై రాశీ ఎమోషనల్:

తన అందం, అభినయానికి గుర్తింపుగా ఇంతటి గౌరవం దక్కడంపై రాశీ ఖన్నా సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ.. "మహిళలను గౌరవిస్తూ, నన్ను 'దివా ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' అవార్డుతో సత్కరించినందుకు జీ తెలుగు అప్సర అవార్డ్స్‌కు ధన్యవాదాలు" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సమ్మర్ ఫ్యాషన్ ప్రేమికులకు సరికొత్త ట్రీట్ ఇస్తున్నాయి.

ఓటీటీలో జోరు:

కేవలం గ్లామర్ ఫోటోషూట్‌లతోనే కాకుండా, సినిమాలతోనూ రాశీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆమె లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త మ్యూజికల్ యాక్షన్ డ్రామా సిరీస్ 'లుఖ్కే' స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద స్క్రీన్ పైన మాత్రమే కాక చిన్న స్క్రీన్‌పై కూడా రాశీ తన వైవిధ్యమైన నటనతో ఆడియన్స్‌ను ఎంతగానో అలరిస్తోంది.

'ఉస్తాద్‌'తో కెరీర్ పీక్ స్టేజ్‌కు:

ఈ ఏడాది రాశీ ఖన్నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అని చెప్పచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో రాశీ ఖాతాలో మరో క్రేజీ మైల్‌స్టోన్ పడింది.

రాశీ ఖన్నా అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, వైవిధ్యమైన పాత్రలను అలవోకగా చేయగల మంచి టాలెంట్ ఉన్న నటి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తన స్టైలిష్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ 'సిల్వర్ స్క్రీన్ దివా' మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలని ఆమె ఫాన్స్ తో పాటు మనము కోరుకుందాం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu