Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లోబల్ సర్వేల్లో సౌత్ హీరోల హవా!

గ్లోబల్ సర్వేల్లో సౌత్ హీరోల హవా!

Tupaki.com 1 week ago

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా సౌత్ హీరోల పేర్లే వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ గ్లోబల్ సంస్థలు విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలే ఇందుకు సాక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఎమ్ డీబీ , ఓర్మాక్స్ వంటి సంస్థల సర్వేలలో దక్షిణాది హీరోలు అగ్రస్థానాలను కైవసం చేసుకుని బాలీవుడ్ స్టార్లకు గట్టి షాక్ ఇచ్చారు. ఓర్మాక్స్ సర్వేలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. `బాహుబలి` నుండి `సలార్`, `కల్కి` వరకు డార్లింగ్ సృష్టించిన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.

సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ప్రభాస్ కున్న క్రేజ్ ఇప్పట్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని ఈ సర్వేలు చూస్తే తెలుస్తోంది. కోలీవుడ్ దళపతి విజయ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇది ఆయన ఫ్యాన్ బేస్ కు నిదర్శనం. రాజకీయ ప్రవేశం చేసినా? విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. తమిళనాడులోనే కాకుండా కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉండటం విశేషం. విజయ్ ప్రతి సినిమా గ్లోబల్ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. టాలీవుడ్ నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా టాప్ ప్లేస్ లలో నిలిచారు.

`పుష్ప` సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ ఐకాన్ గా మారగా ` ఆర్ ఆర్ ఆర్ ` విజయంతో రామ్ చరణ్, తారక్ లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వీరి సినిమాలు భారతదేశంలోనే కాకుండా జపాన్, అమెరికా వంటి దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురి పిస్తున్నాయి. సౌత్ హీరోల విజయ రహస్యం వారు ఎంచుకునే కథలు , వారి చిత్రాల నిర్మాణ విలువల్లోనే ఉంది. రాజమౌళి వంటి దర్శకులు నిర్మించిన పునాదులపై ఈ హీరోలు తమ మార్కెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించు కుంటున్నారు. గతంలో బాలీవుడ్ కే పరిమితమైన గ్లోబల్ మార్కెట్ ఇప్పుడు సౌత్ స్టార్ల గుప్పిట్లోకి వచ్చింది.

ఇది భారతీయ సినిమాకు గర్వకారణం. గ్లోబల్ సర్వేలలో సౌత్ హీరోల ఆధిపత్యం ఒక సీజన్ కు పరిమితం కాదు. ఇదొక కొత్త శకానికి ఆరంభం. రాబోయే కాలంలో సౌత్ హీరోల నుండి మరిన్ని పెద్ద సినిమాలు రాబోతున్నాయి. పెద్ది,డ్రాగన్, వారణాసి, రాక, కల్కి 2, స్పిరిట్ లాంటి చిత్రాలు విజయం సాధిస్తే? అందులో హీరోలంతా ఇండియాలోనే టాప్ హీరోలగా కొనసాగుతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu