Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గొర్రెలు కాస్తే లక్షల జీతం. నమ్మలేని ఆఫర్!

గొర్రెలు కాస్తే లక్షల జీతం. నమ్మలేని ఆఫర్!

Tupaki.com 1 week ago

దువు రాకపోయినా.. ఏ పని చేతకాకపోయినా "గొర్రెలు కాసుకో" అని తిట్టే రోజులు పోయాయి. ఇప్పుడు గొర్రెలు కాస్తేనే నెలకు రూ.1.1 లక్షల జీతం ఇస్తామంటున్నారు.

నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఐటీ ఉద్యోగాల్లో కోతలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు,నిరుద్యోగులు కూడా ఇప్పుడు గొర్రెల కాపరులుగా మారడానికి క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్రేజీ ఆఫర్ ఏంటో, ఎక్కడో ఆ వివరాలు చూద్దాం..

చైనాలో వింత ప్రకటన:

ఈ వింత ఆఫర్ మన దేశంలో కాదు, మన పక్కనే ఉన్న చైనాలో వచ్చింది. అక్కడ జూవో జియోవో యాంగ్ అనే వ్యక్తికి భారీగా గొర్రెల ఫామ్‌లు ఉన్నాయి. ఇక తన గొర్రెలను మేపడానికి ఇద్దరు కాపరులు కావాలంటూ అతడు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వెలంబో' లో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది.

అదిరిపోయే జీతం.. ఉచిత వసతి:

ఈ ఉద్యోగంలో చేరిన వారికి నెలకు రూ.1.1 లక్షల భారీ జీతంతో పాటు, ఉచితంగా ఉండటానికి వసతి, రోజువారీ సరుకులు కూడా ఇస్తానని జూవో ప్రకటించాడు. ఇక నేటి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన ఉద్యోగ భద్రత లేకపోవడంతో, ఈ ఆఫర్ చూసి చాలామంది ఆకర్షితులయ్యారు.

క్యూ కడుతున్న ఐటీ ఉద్యోగులు:

ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో దాదాపు 5.9 కోట్ల వ్యూస్ వచ్చాయి. కేవలం రెండు ఖాళీల కోసం ఏకంగా 700 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇందులో విశేషం ఏంటంటే, ఉద్యోగాలు కోల్పోయిన IT ఉద్యోగులు, పెద్ద చదువులు చదివిన వారు కూడా గొర్రెలు కాయడానికి రెడీ అంటూ అప్లై చేసుకున్నారు.

గొర్రెలతో కోట్లు సంపాదన:

చైనాలో గొర్రె మాంసానికి, వాటి ఉన్నికు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే జూవో ఈ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంత లాభం ఉంది కాబట్టే, కాపరులకు కూడా లక్షల్లో జీతం ఇవ్వడానికి అతడు వెనకాడటం లేదు. ఇక అయితే పోటీ భారీగా ఉండటంతో, గొర్రెలను బాగా కాసే నైపుణ్యం ఉన్నవారినే ఉద్యోగంలోకి తీసుకుంటానని జూవో చెప్తున్నాడు.

కాలాన్ని బట్టి ఉద్యోగాల డిమాండ్ మారిపోతుంటుంది అనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఒకప్పుడు తక్కువగా చూసిన పనే, నేడు లక్షల జీతాన్ని అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఏదేమైనా, కష్టపడే గుణం ఉండాలే కానీ ఏ పనైనా తక్కువ కాదు అని ఈ క్రేజీ నోటిఫికేషన్ నిరూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu