Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుడివాడను నానీకే వదిలేశారా ..!

గుడివాడను నానీకే వదిలేశారా ..!

Tupaki.com 1 week ago

మ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు ఉంటుందన్న విషయం ఆసక్తిగా మారింది. గత ఎన్నికల సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని తాను మరోసారి పోటీ చేయనని, ఇదే చివరి అవకాశమని ఆయన అప్పట్లో చెప్పారు.

కానీ ప్రజలు ఓడించారు. ఇక ఈ నియోజకవర్గ నుంచి టిడిపి తరఫున వెనిగండ్ల రామ్మోహన్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనకే టిడిపి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

మరి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని పోటీకి దూరంగా ఉంటారా.. లేకపోతే మాట వెనక్కి తీసుకుని మళ్ళీ పోటీ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ నియోజకవర్గంలో యాక్టివిటీ లేదు. ఒకవేళ ఉన్నా అది పూర్తిగా కొడాలి నాని కనుసన్నలోనే జరుగుతుంది. ఒకప్పుడు తనకు తిరుగులేదని భావించిన నాని గత ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రజల్లోకి రావడం మానేశారు.

పార్టీ తరఫున పెద్దగా వాయిస్ కూడా వినిపించడం లేదు. అయితే ఆయనపై ఉన్న కేసుల కారణంగా మౌనంగా ఉంటున్నారు అన్న చర్చ నడుస్తున్నప్పటికీ తను కేసులకు భయపడే తరహా కాదని ప్రస్తుతం తాను మౌనంగా ఉంటే మంచిదన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉంటున్నానని చెబుతున్నారు. సమయం సందర్భం చూసుకుని స్పందిస్తానని ఇటీవల నాని వ్యాఖ్యానించారు. కానీ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నానీ విషయంలో ఒక వర్గం నాయకులు ఇప్పటికీ అదే అసంతృప్తితో ఉన్నారు.

నానిని గెలిపించడం వల్ల నష్టపోయామని వర్గం ఇప్పటికి అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే రాము అందరికీ అనుకూలంగా ఉన్నారు. సౌమ్యంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి రాము వ్యక్తిగతంగా కూడా మంచివారన్న పేరును సంపాదించుకున్నాడు. అంతేకాదు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుందన్న ఉద్దేశం ప్రజల్లో కనిపిస్తోంది.

ఈ తరహా పరిస్థితి గతంలో లేకపోవడం.. అదే సమయంలో గత ఎన్నికల సమయంలో నేను మళ్ళీ పోటీ చేయనని నాని చెప్పిన క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందని ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వైసీపీ కూడా గుడివాడ నియోజకవర్గం పై మౌనంగా ఉంది. అంటే ఈ నియోజకవర్గ విషయంలో పూర్తిస్థాయి నిర్ణయం నాని చేతిలోనే పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu