Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుసగుస: విడాకులై ఇద్దరు పిల్లలున్న క్రికెటర్‌తో హోటల్‌లో నటి!

గుసగుస: విడాకులై ఇద్దరు పిల్లలున్న క్రికెటర్‌తో హోటల్‌లో నటి!

Tupaki.com 1 week ago

భారతీయ సినీ రంగానికి, క్రికెట్ ప్రపంచానికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ఎంతోమంది నటీమణులు క్రికెటర్లతో ప్రేమలో పడటం.. పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ టాప్ నటి .. ఒక పాపులర్ క్రికెటర్ ముంబైలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో కలిసి కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హా*ట్ టాపిగ్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతున్న లీకుల ప్రకారం.. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో `టాప్ 5` స్థానాల్లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ఆ క్రికెటర్‌తో కలిసి సమయం గడపడం గుసగుసలకు తావిస్తోంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ బి-టౌన్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు ఊపందుకున్నాయి.

ఈ వ్యవహారంలో అందరినీ అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. సదరు క్రికెటర్‌కు ఇదివరకే వివాహమై విడాకులైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకవైపు కెరీర్ పీక్స్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలా విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలున్న ఒక సీనియర్ క్రికెటర్‌తో హోటల్‌లో ప్రత్యక్షమవ్వడం వెనుక అసలు కథ ఏమిటనే దానిపై నెటిజన్లు డిటెక్టివ్‌లుగా మారిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇద్దరి పేర్లను బయటపెట్టకుండా సాగుతున్న ఈ ప్రచారం సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీసింది.

అయితే ఇలాంటి అనామక లీకులు.. గాసిప్‌లు బాలీవుడ్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితమైన ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియా బజ్ కోసం ప్రముఖుల పేర్లను పరోక్షంగా వాడుకుంటూ ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం వల్ల పరిశ్రమపై ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. ఒక అగ్ర నటి..దేశం గర్వించే క్రికెటర్ల ఇమేజ్‌ను ఇటువంటి నిర్ధారణ లేని వార్తలు డ్యామేజ్ చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతానికి ఆ `టాప్ 5` బాలీవుడ్ నటి ఎవరు? అలాగే ఇద్దరు పిల్లలున్న ఆ `పాపులర్ క్రికెటర్` ఎవరనే సస్పెన్స్‌పై నెట్టింట రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లకు అడ్డుకట్ట పడాలన్నా లేదా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలన్నా.. సదరు నటి లేదా క్రికెటర్ తరపు నుండి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu