Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హార్ట్‌బ్రేక్: మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ!

హార్ట్‌బ్రేక్: మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ!

Tupaki.com 1 week ago

యసు కేవలం ఒక నంబర్ మాత్రమే.. ఆటపై ఉండే ప్రాణం.. గెలవాలనే కసి ముఖ్యం అని నిరూపించాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు. కానీ విధి అతడి పోరాటాన్ని గుర్తించలేదు.

ఒంటరి పోరాటం చేసి అలసిపోయిన ఆ కళ్లు చివరకు కన్నీటి సముద్రమయ్యాయి.

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే జట్టు ఓడిపోయినా.. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను కదిలిస్తున్నాయి.

ఒంటరి పోరాటం.. వికెట్లు పడుతున్నా వెనకడుగు వేయని నైజం

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు సూర్యవంశీ. ఒకవైపు ప్రెజర్.. మరోవైపు సీనియర్ వికెట్లు కళ్లముందే కూలుతున్నాయి. తోటి ఓపెనర్ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సహా కీలక ఆటగాళ్లంతా ఘోరంగా నిరాశపరిచారు. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు కొండంత ధైర్యంతో క్రీజులో నిలబడ్డాడు. గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఒంటరి పోరాటం చేశాడు.

4 పరుగుల దూరంలో సెంచరీ మిస్.. అయినా అసాధారణ ఇన్నింగ్స్!

సూర్యవంశీ కేవలం 96 పరుగులు చేసి, తన అద్భుతమైన సెంచరీని కేవలం 4 పరుగుల దూరంలో చేజార్చుకున్నాడు. కానీ, అతడి ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌కు 200 ప్లస్ పరుగుల భారీ స్కోరును అందించింది. గుజరాత్ బౌలర్లపై సింహంలా విరుచుకుపడుతూనే అవసరమైన చోట ఎంతో పరిణతి చెందిన ఆటగాడిలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. మిగతా బ్యాటర్ల నుంచి కనీస సహకారం అంది ఉంటే, ఈరోజు రాజస్థాన్ రాయల్స్ కథ వేరేలా ఉండేది.

బౌండరీ లైన్ వద్ద వెక్కివెక్కి ఏడ్చిన సూర్యవంశీ

మ్యాచ్‌లో ఓటమి ఖరారైన క్షణంలో.. వైభవ్ సూర్యవంశీ తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. జట్టును గెలిపించలేకపోయాననే ఆవేదన, శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైందనే బాధ అతడిని చుట్టుముట్టాయి. బౌండరీ లైన్ వద్ద కూర్చుని అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు క్రికెట్ ప్రేమికుల గుండెలను పిండేస్తున్నాయి.

భారత క్రికెట్ భవిష్యత్తు ఆస్తి.. విశ్లేషకుల ప్రశంసలు

"ఈ వయసులో ఇంతటి ఒత్తిడిని తట్టుకుని, ఇంత బాధ్యతగా ఆడటం సామాన్యం కాదు" అంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓటమి బాధ అతడిని కన్నీళ్లు పెట్టించినా.. ఈ రాత్రి అతడు ప్రదర్శించిన పోరాట పటిమ మాత్రం కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

"నువ్వు ఏడవకు వైభవ్.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తు నీదే!" అంటూ నెటిజన్లు అతడికి అండగా నిలుస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu