Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరో అపార్ట్ మెంట్ లో పాము కలకలం!

హీరో అపార్ట్ మెంట్ లో పాము కలకలం!

Tupaki.com 5 days ago

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఐకానిక్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లో నివసిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెలబ్రిటీ హోమ్‌లో ఓ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి పాము హఠాత్తుగా ప్రవేశించడంతో అక్కడ ఉన్న సిబ్బంది భద్రతా అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తెలియడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం కాస్త కంగారు పడ్డారు. అపార్ట్‌మెంట్‌లోని ఓ నిర్దిష్ట భాగంలో పాము కదులుతుండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జాగ్రత్త పడుతూ వెంటనే స్థానిక వైల్డ్‌లైఫ్ రెస్క్యూ బృందానికి ,స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఎంతో నైపుణ్యంతో? ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా పామును సురక్షితంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అటుపై పట్టుబడిన పామును నగరానికి దూరంగా ఉన్న ఒక సురక్షితమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అటవీ శాఖ అధికారుల సమక్షంలో వదిలిపెట్టినట్లు సమాచారం. ముంబై వంటి మెట్రో నగరాలలో వర్షాలు , వాతావరణ మార్పుల కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి వన్యప్రాణులు నివాస ప్రాంతాలలోకి రావడం సహజమే అయినా? సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరో నివాసంలో ఈ ఘటన జరగడంతో జాతీయ స్థాయిలో పెద్ద వార్తగా నిలిచింది.

ఈ ఘటన జరిగిన సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారా లేదా అనే వివరాలు ఇంకా బటయకు రాలేదు. నిజానికి సల్మాన్ ఖాన్‌కు పాములతో ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై శివార్లలోని తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్‌ను ఓ పాము కరిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

ఆ పాత చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ మళ్లీ ముంబై నివాసంలోనే పాము ప్రత్యక్షం కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ చుట్టూ భారీ భద్రతా వలయం ఉంటుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు ఉన్న థ్రెట్ పర్సెప్షన్ కారణంగా ముంబై పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎల్లప్పుడూ అక్కడ కఠినమైన నిఘా ఉంచుతారు. అలాంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి కూడా పాము ఎంటర్ అవ్వడంపై ఇంకేవైనా కారణాలున్నాయి? అన్నది తెలియాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu