Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోలంతా బీర్ల కోసం రేవంత్ దగ్గరికి వెళ్లారా? సీఎం షాకింగ్ కామెంట్స్

హీరోలంతా బీర్ల కోసం రేవంత్ దగ్గరికి వెళ్లారా? సీఎం షాకింగ్ కామెంట్స్

Tupaki.com 1 week ago

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీతో తన సంబంధాలపై వస్తున్న ప్రచారానికి ఆయన ఓ కార్యక్రమంలో ఆసక్తికరంగా స్పందించారు.

ముఖ్యంగా సింగిల్ బీర్ తాగడానికి కూడా తన దగ్గరికి ఒకప్పుడు వచ్చేవారంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని పెద్దగా కలవడం లేదని, అదే సమయంలో బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తరచూ భేటీ అవుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌ గా మారాయి. తనకు ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు.

"నేను ఇండస్ట్రీని కొత్తగా చూడడం లేదు. నాకు ఎక్కువ వివరాలు తెలుసు. అంతే కాదు నాకు అందరి గురించి తెలుసు. అందుకే నా దగ్గరికి వచ్చి చెప్పలేరు" అని వ్యాఖ్యానించారు. ఒక్కసారిగా డబ్బు, హోదా వచ్చిన తర్వాత కొందరిలో మార్పులు వస్తాయని, సెలబ్రిటీలతో కలవాలని, సోషల్‌ గా ఎదగాలని భావిస్తారని చెప్పారు. దీనినే సోషల్ క్లైంబింగ్ అంటారని ఆయన పేర్కొన్నారు.

అప్పటి వరకు మనలో మనం అణిచి వేసుకున్న కొన్ని కోరికలు ఉంటాయని, ఒక్కసారిగా అవి నిద్రలేస్తాయని చెప్పారు. ఇప్పుడు స్టార్లు అంటున్న వాళ్లలో చాలా మంది తనకు 30 సంవత్సరాల క్రితమే తెలుసని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే రోజుల్లో సింగిల్ బీర్ కోసం తన దగ్గరికి వచ్చేవారని, సంతకం పెట్టు అన్న.. బీర్ తాగుతామని అనేవారంటూ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.

అలాగే తాను ఎవరి ముందు నటించనని, అందరితో ఒకేలా వ్యవహరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "అమెరికా అంబాసిడర్ వచ్చినా, ప్రధాని వచ్చినా, సాఫ్ట్వేర్ సీఈఓ వచ్చినా అందరినీ ఒకేలా గౌరవిస్తా. వంగి వంగి దండాలు పెట్టడం నాకు రాదు. అది నా బ్లడ్ లోనే లేదు" అని అన్నారు. ఆ వ్యాఖ్యలతో ఆయన తన వ్యక్తిత్వాన్ని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

అయితే రేవంత్ రెడ్డి కామెంట్స్ లో రాజకీయ ధోరణి మాత్రమే కాకుండా, సినీ ప్రముఖులపై కూడా ఒక రకమైన అసంతృప్తి కనిపించిందని కొందరు నెటిజన్లు అంటున్నారు భావిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ తో ప్రభుత్వ సంబంధాలపై గతంలోనూ పలు సందర్భాల్లో చర్చ జరిగింది. సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, పరిశ్రమ సమస్యలు వంటి అంశాల్లో సినీ పెద్దలు ప్రభుత్వంతో దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు సీఎం వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం అవసరమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన స్వభావం అలాంటిదేనని, ఎవరి కోసం ప్రత్యేకంగా మారబోనని స్పష్టం చేశారు. మొత్తానికి సీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. మరి టాలీవుడ్ ప్రముఖులు ఆ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu