Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హీరోయిన్ కి ఓనం సెలవు ఇవ్వని డైరెక్టర్!

హీరోయిన్ కి ఓనం సెలవు ఇవ్వని డైరెక్టర్!

Tupaki.com 3 weeks ago

సౌత్ - నార్త్ సినీ పరిశ్రమలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం అమ్మడు వృత్తిగత జీవితంలో బిజీగా గడుపుతున్నారు.

కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ ఓనం వేడుకలను ఈసారి అమ్మడు మిస్ కావాల్సి వచ్చింది. పండుగ రోజుల్లో కూడా ఇంటికి దూరంగా ముంబైలో షూటింగ్‌లో పాల్గొనడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా చిత్రం `ప్రళయ్`. ఇందులో హీరోయిన్గా కల్యాణి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ పాల్గొంటున్నారు. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ క్యాలెండర్ ప్రకారం ప్లాన్ చేయబడటంతో పండుగ సెలవులను సైతం పక్కన పెట్టి అమ్మడు ప్రాజెక్ట్‌కు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతిఏటా కుటుంబంతో కలిసి ఘనంగా ఆస్వాదించే ఓనం సద్య విందును ఈసారి తాను కోల్పోయానని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంటికి దూరంగా ఉంటూ పండుగను మిస్ అవుతున్నా? అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. సెట్స్‌లో తోటి నటీనటులు, చిత్ర యూనిట్ సభ్యులు కలిసి తనకు చిన్నపాటి సెలబ్రేషన్స్ నిర్వహించడంతో సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు రణ్‌వీర్ సింగ్ - చిత్ర బృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. `ప్రళయ్` చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో హై-ఓల్టేజ్ యాక్షన్ భావోద్వెగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాతో కళ్యాణి బాలీవుడ్‌లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న కళ్యాణి ప్రియదర్శన్ సినిమాల కోసం వ్యక్తిగత జీవితంలోని పండు గలను, వేడుకలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడటం లేదనేది దీనిబట్టి స్పష్టమవుతోంది. నటిగా కల్యాణి చూపుతున్న అంకితభావం .. శ్రద్ధ చిత్ర పరిశ్రమలో అందరి ప్రశంసలను అందుకుంటోంది. కల్యాణి కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోంది.

మొత్తానికి ఓనం పండుగ మిస్ అయినా? రణ్‌వీర్ సింగ్‌తో కలిసి `ప్రళయ్` షూటింగ్ డేస్ ను అస్వాదిస్తోంది. పండగలు ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ ఒకసారి సినిమా ఛాన్స్ మిస్ అయితే అదే హీరోతో మళ్లీ ఛాన్స్ రావడం అంత సులభం కాదు. అలా జరగాలంటే తానో పెద్ద స్టార్ కావాలి. నయనతార రేంజ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నప్పుడు వచ్చిన అవకాశాలను వదులకున్నా? మళ్లీ మళ్లీ దర్శక, నిర్మాతలు వెంట పడేది. ఆ రేంజ్ సక్సెస్ వచ్చే వరకూ జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu