Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇది పెద్దికి అదే పెద్ద ప్లస్సా..

ఇది పెద్దికి అదే పెద్ద ప్లస్సా..

Tupaki.com 1 week ago

సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ, క్యాస్టింగ్ యాక్టింగ్, మ్యూజిక్ ఎంత ముఖ్యమో.. హీరో-డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ అండ్ అండర్‌ స్టాండింగ్ కూడా అంతే కీలకం.

ఇప్పుడు అదే విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌ ను కూడా మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఆ చిత్రాన్ని జూన్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిన్న వీడియో సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన లాంగ్ డ్రైవ్ వీడియోలో, 'నన్ను లాంగ్ డ్రైవ్‌ కు ఎవరు తీసుకొచ్చారో తెలుసా?' అంటూ కెమెరాను పక్కకు తిప్పగా డ్రైవింగ్ సీట్ లో రామ్ చరణ్ కనిపించారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించిన ఆ వీడియో అభిమానులను మెప్పించింది.

వీడియోలో సినిమా రిలీజ్ టెన్షన్ మధ్య చిల్ అవుతున్నట్లు కనిపించిన వీరిద్దరి బాండింగ్ ఫ్యాన్స్‌ కు స్పెషల్ ఫీల్ ఇచ్చింది. 'మన సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పు' అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ప్రోమో అసలు ఒక స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించినదని, పూర్తి వీడియోను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

సాధారణంగా దర్శకుడు, హీరో మధ్య మంచి రిలేషన్ ఉంటే సినిమా మేకింగ్ మరింత ఈజీ అవుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు, పాత్రల డెప్త్, స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాల్లో ఇద్దరి మధ్య సరైన అండర్‌ స్టాండింగ్ ఉంటే అవుట్‌ పుట్ కూడా బలంగా వస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్- బుచ్చిబాబు మధ్య కనిపిస్తున్న బాండింగ్ కూడా పెద్దికి అదే స్థాయి ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప్పెనతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో పెద్దిని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన చరణ్.. పెద్దిలో పూర్తి మాస్, రస్టిక్ లుక్‌ లో కనిపించబోతున్నారు. 1980ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో మట్టి కుస్తీ వీరుడి పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు సమాచారం.

చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచగా.. ఇప్పుడు చరణ్- బుచ్చిబాబు ఫ్రెండ్లీ బాండింగ్ మూవీకి మెయిన్ అసెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఆ జోడీ సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ వైబ్ తీసుకురావడం కూడా మేకర్స్‌ కు కలిసొస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu