Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇళయరాజా మళ్ళీ ఫీలయ్యారా?

ఇళయరాజా మళ్ళీ ఫీలయ్యారా?

Tupaki.com 6 days ago

ఇండియన్ మ్యూజిక్ వరల్డ్ లో లెజెండరీ కంపోజర్‌ గా గుర్తింపు పొందిన ఇళయరాజా పేరు మరోసారి కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) మూవీ విడుదలై మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది.

అయితే సినిమాలోని ఓ డైలాగ్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఇళయరాజాకు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి కరుప్పు మూవీ సెకండాఫ్‌ లో వచ్చే ఒక సీన్ లో సాంగ్స్ కాపీరైట్ అంశంపై వ్యంగ్యంగా ఓ డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ లో బ్యాక్ గ్రౌండ్‌ లో విజయ్‌ కాంత్ సినిమాకు సంబంధించిన ఓ పాట వినిపించగా.. ఆ తర్వాత వచ్చే కన్వర్జేషన్ పరోక్షంగా ఇళయరాజాను ఉద్దేశించినట్టు అనేక మంది మూవీ లవర్స్ భావించారు. ముఖ్యంగా ఆయన గతంలో పాటల హక్కుల విషయంలో తీసుకున్న స్టాండ్‌ ను సెటైరికల్‌ గా చూపించారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

దీంతో వివాదం పెద్దది అయ్యేటట్లు కనిపిస్తుండగా.. ఇప్పుడు మూవీ టీమ్ రెస్పాండ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ విడుదల చేసిన ప్రకటనలో ఇళయరాజాపై తమకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేసింది. భారతీయ సంగీతానికి ఆయన అందించిన సేవలు ఎన్నో జెనరేషన్లకు ఇన్స్పిరేషన్ అని పేర్కొంది. కరుప్పు సినిమాలోని ఒక డైలాగ్ వల్ల ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నామని తెలిపింది.

అలాగే ఆ డైలాగ్‌ను వ్యక్తిగతంగా ఇళయరాజాను టార్గెట్ గా చేసుకుని రాయలేదని కూడా వివరణ ఇచ్చింది. అది కేవలం వ్యంగ్య సందర్భంలో భాగంగా మాత్రమే ఉంచిన డైలాగ్ అని పేర్కొంది. అయినప్పటికీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తప్పుగా అర్థమైందని భావించి ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ఇటీవల కాలంలో ఇళయరాజా పేరు కాపీరైట్ వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆయన కంపోజ్ చేసిన పాటలను అనుమతి లేకుండా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పలుమార్లు హెచ్చరించారు. పలువురు నిర్మాతలు, సంగీత సంస్థలకు నోటీసులు కూడా పంపించారు. దీంతో ఆయన పాటల హక్కుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఈ నేపథ్యంలో కరుప్పు సినిమాలో వచ్చిన డైలాగ్ మరింత సెన్సిటివ్ ఇష్యూగా మారింది.

మరోవైపు ఆ వివాదంపై ఇళయరాజా ఇప్పటివరకు అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. కానీ మేకర్స్ వెంటనే క్షమాపణ చెప్పి సన్నివేశాన్ని తొలగించడంతో వివాదం ఇక్కడితో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఆ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తుంటే.. మరికొందరు సినిమాల్లో వ్యంగ్యానికి కూడా కొన్ని లిమిట్స్ ఉండాలంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu