Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంత టాలెంట్ ఉండి సైలెంట్ గా ఎందుకు తేజస్విని?

ఇంత టాలెంట్ ఉండి సైలెంట్ గా ఎందుకు తేజస్విని?

Tupaki.com 0 months ago

నందమూరి ఫ్యామిలీకి చెందిన తేజస్విని పేరు ఇప్పటివరకు ఎక్కువగా ప్రొడ్యూసర్ గా, క్రియేటివ్ కన్సల్టెంట్‌ గా, ఫ్యామిలీ మెంబర్ గా మాత్రమే వినిపించేది.

అయితే లేటెస్ట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌ తో కలిసి చేసిన డ్యాన్స్‌ లో ఆమె గ్రేస్, ఎనర్జీ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే తేజస్విని కొన్ని రోజులుగా తనలోని టాలెంట్ ను అభిమానులకు మెల్లగా పరిచయం చేస్తున్నారు. గతంలో ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో కనిపించి ప్రశంసలు అందుకున్న ఆమె, ఇప్పుడు డ్యాన్స్‌ తో కూడా ఆకట్టుకోవడం విశేషం. దీంతో తేజస్వినిలో ఇంత టాలెంట్ ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నందమూరి బాలకృష్ణ చిన్న కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రొగ్రామ్ సక్సెస్ అవ్వడంలో ఆమె పాత్ర ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌ గా, ప్లాన్ క్రియేటర్ గా ఆమె చేసిన వర్క్ గురించి ఇప్పటికే మంచి అభిప్రాయం ఉంది.

సినిమాల్లో నటించకపోయినా, సినీ రంగానికి మాత్రం తేజస్విని ఎప్పటినుంచో దగ్గరగానే ఉన్నారు. కొన్ని చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైన్ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, కథల సెలెక్షన్ నుంచి పలు క్రియేటివిటీ అంశాల వరకు తన సజెన్స్ అందించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. అందుకే ఆమెను కేవలం స్టార్ హీరో కూతురిగా కాకుండా, ఇండస్ట్రీపై అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా చూస్తున్నారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోలో తేజస్విని డెడికేషన్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టెప్స్‌ లో నేచురాలిటీ, బీట్‌ కు తగ్గట్టుగా ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్స్ చూసి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోకి వస్తే మంచి గుర్తింపు తెచ్చుకుంటారని, నందమూరి కుటుంబం నుంచి మరో టాలెంటెడ్ సెలబ్రిటీ వస్తున్నారంటూ అనేక మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం తేజస్విని ఫోకస్ అంతా కుటుంబ బాధ్యతలు, వ్యాపార వ్యవహారాలు, క్రియేటివిటీ విషయాలపైనే ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ భార్యగా, కుటుంబ సభ్యురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇతర ఇండస్ట్రీల్లో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజా డ్యాన్స్ వీడియోతో తేజస్విని గురించి అభిమానుల అభిప్రాయం మరింత మారింది.

ఇన్నాళ్లు స్క్రీన్ వెనుక కనిపించిన ఆమె, ఇప్పుడు తనలోని టాలెంట్లు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. యాక్టింగ్, క్రియేటివిటీ, డ్యాన్స్ వంటి విషయాల్లో తన స్టామినా చూపిస్తున్న తేజస్విని ఫ్యూచర్ లో దేన్ని సెలెక్ట్ చేసుకున్నా సక్సెస్ ఫుల్ గా రాణించే అవకాశం ఉందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మాత్రం ఆమె డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu