Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇరాన్ టెన్షన్ మధ్య ట్రంప్ ట్విస్ట్.. కొడుకు పెళ్లిపై సందేహం!

ఇరాన్ టెన్షన్ మధ్య ట్రంప్ ట్విస్ట్.. కొడుకు పెళ్లిపై సందేహం!

Tupaki.com 2 days ago

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కొడుకు పెళ్లి విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇరాన్‌తో నడుస్తున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల తాను ఈ వేడుకకు హాజరుకాకపోవచ్చని హింట్ ఇచ్చారు.

దేశ పరిస్థితులు ముఖ్యం కాబట్టి, పెళ్లికి వెళ్లడంపై ఇంకా క్లారిటీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ .. అసలు వివరాలు ఇలా వున్నాయి..

ఇరాన్ టెన్షన్స్ వల్లేనా?:

ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పొలిటికల్ వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇలాంటి కీలక సమయంలో దేశాన్ని వదిలి వెళ్లడం కరెక్ట్ కాదని ట్రంప్ భావిస్తున్నారు. తన పెద్ద కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లికి హాజరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తానని, కానీ ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఇది సరైన సమయం కాదని ఆయన ఓపెన్‌గా చెప్పారు.

ఫేక్ న్యూస్ అంటూ ట్రంప్ జోక్:

ఈ టెన్షన్ల మధ్య కూడా ట్రంప్ తనదైన శైలిలో మీడియాపై జోకులు వేశారు. తాను కొడుకు పెళ్లికి వెళ్లినా, వెళ్లకపోయినా మీడియా మాత్రం ఊరుకోదని అన్నారు. "నేను పెళ్లికి హాజరైనా, కాకపోయినా ఇక్కడి ఫేక్ న్యూస్ మీడియా నన్ను వార్తలతో చంపేస్తుంది" అంటూ ఆయన సరదాగా కామెంట్ చేశారు. మీడియా తనను ఎలాగైనా టార్గెట్ చేస్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బహమాస్‌లో ఘనంగా పెళ్లి:

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం రేపు బహమాస్ దీవుల్లో అత్యంత ఘనంగా జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సరిగ్గా పెళ్లికి ఒకరోజు ముందు దేశాధ్యక్షుడైన తండ్రి వస్తారో రారో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ఈ వివాహంపై అందరి దృష్టి పడింది.

48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో తన ప్రియురాలు బెట్టీనా ఆండర్సన్ ను బహమాస్‌లో అత్యంత ప్రైవేట్‌గా వివాహం చేసుకోనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులను మాత్రమే ఆహ్వానించిన ఈ వేడుక కోసం అక్కడి రిసార్ట్ ప్రాంతంలో ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వ్యక్తిగత జీవితం గత కొన్నేళ్లుగా అక్కడి అమెరికన్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

కొడుక్కి ఇది రెండో పెళ్లి:

ట్రంప్ జూనియర్‌కు ఇది రెండో వివాహం కావడం విశేషం. గతంలో ఆయనకు మోడల్ వానీసా ట్రంప్‌తో వివాహం జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ 2018 లోనే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.

ఒకవైపు కొడుకు పెళ్లి సంబరాలు, మరోవైపు ఇరాన్ దేశంతో అంతర్జాతీయ సవాళ్లు.. ఈ రెండింటి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలిగిపోతున్నారు. మరి కుటుంబ వేడుక కోసం ఆయన బహమాస్ వెళ్తారా? లేక దేశ రక్షణ బాధ్యతలను చూస్తూ వైట్ హౌస్‌కే పరిమితమవుతారా? అనేది రేపటితో తేలిపోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu