Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాబిల్లిలా చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ కపూర్!

జాబిల్లిలా చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ కపూర్!

Tupaki.com 5 days ago

గ్లామర్ ప్రపంచంలో నెట్టుకు రావాలంటే అందాలు ఆరబోయాలనే కాలం మళ్ళీ వచ్చిందేమో అనిపిస్తోంది నేటితరం ముద్దుగుమ్మలను చూస్తుంటే.. ఒకవైపు ఫ్యాషన్ ఉట్టిపడేలా దుస్తులను ధరిస్తూనే..

ఆ దుస్తులతో కూడా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామలు.. అటు ఈ ఫాలోవర్స్ ద్వారానే సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటున్నారనటంలో సందేహం లేదు.

ఇకపోతే ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దివంగత నటీమణి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అంతకు మించిన నటన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ చిన్నది.. బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది.

తాజాగా బ్లూ కలర్ ఉల్లిపొర లాంటి చీర కట్టుకున్న జాన్వీ కపూర్ షోల్డర్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ వేదికలపై ఈ బ్యూటీలు చున్నీని హైలెట్ చేస్తూ తమ ఔట్ఫిట్ ని మరింత అట్రాక్టివ్ గా మారుస్తున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే ఇటు జాన్వీ కపూర్ కూడా ఈ బ్లూ కలర్ చీర పైకి కాంబినేషన్ లో నెట్టెడ్ బ్లూ కలర్ చున్నీని మెడకు ధరించి మరింత హొయలు పోయింది.

ఇదొక ట్రెండీ ఫోజు అన్నట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మొత్తానికైతే శారీ అవుట్ ఫిట్ లో కూడా ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న జాన్వీ కపూర్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జాన్వీ కపూర్ విషయానికి వస్తే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, దివంగత నటీమణి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇటు టాలీవుడ్ లో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది . మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న ఈమె.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. మే 18న ఈ సినిమా ట్రైలర్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు . అందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన జాన్వీ కపూర్ ఆ ఫోటోలను ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా మరొకసారి పంచుకుంది. మొత్తానికి అయితే జూన్ 4వ తేదీన పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu