Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాన్వీ బ్యాటింగ్ చూశారా? బౌలింగ్ ఎవరు చేశారంటే?

జాన్వీ బ్యాటింగ్ చూశారా? బౌలింగ్ ఎవరు చేశారంటే?

Tupaki.com 3 days ago

పీఎల్ 2026 మ్యాచ్‌లతో క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజీ వీడియో బయటకు వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బ్యాటింగ్ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

గల్లీ క్రికెట్ స్టైల్లో సాగిన వీరిద్దరి ఆటను చూసి క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా తెగ మురిసిపోతున్నారు.ఆ విశేషాలు చూద్దాం..

మాల్‌లో గల్లీ క్రికెట్ హడావిడి:

నోయిడాలోని ఫేమస్ 'DLF మాల్ ఆఫ్ ఇండియా'లో రీసెంట్‌గా ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ హాజరయ్యారు. ఈ వేదికపైనే ఇద్దరు స్టార్లు సరదాగా క్రికెట్ ఆడటానికి రెడీ అయ్యారు. ఇక కమిన్స్ చేతికి బంతి ఇవ్వగా, జాన్వీ కపూర్ క్యాజువల్ టీ షర్ట్ వేసుకుని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వచ్చేసింది.

కమిన్స్ బౌలింగ్.. జాన్వీ బ్యాటింగ్:

ప్రపంచాన్ని వణికించే ప్యాట్ కమిన్స్ వేసిన మొదటి మూడు బంతులను జాన్వీ కపూర్ చాలా పద్ధతిగా, క్యూట్‌గా ఆడింది. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ జరిగింది. ఇక నాలుగో బంతిని కాస్త గట్టిగా కొట్టే ప్రయత్నంలో జాన్వీ ఒక పెద్ద తప్పు చేసేసింది. ఇక ఆమె కొట్టిన షాట్ కాస్తా వెళ్లి అక్కడ ఈవెంట్‌లో ఉన్న ఒకరి కంటికి బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి.

ఇన్స్టాగ్రామ్‌లో జాన్వీ క్షమాపణలు:

ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. వీడియోతో పాటు.. "నా బ్యాటింగ్‌తో బంతి వెళ్లి ఎవరి కంటికైతే తగిలిందో వాళ్లకు క్షమాపణలు చెబుతున్నాను. నేను ఇంకా నా బ్యాలెన్స్ వెతుక్కుంటున్నాను" అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. ఈ క్యూట్ అపాలజీ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రమోషన్స్ కోసం ఆసీస్ ప్లేయర్‌తో ఆట:

జాన్వీ కపూర్ తన రాబోయే సినిమాల ప్రమోషన్స్ కోసం ఏకంగా ఆస్ట్రేలియా కెప్టెన్‌నే వాడుకుందంటూ కొందరు నెటిజన్లు ఆమె ఐడియాను మెచ్చుకుంటున్నారు. ఇక ఐపీఎల్ టోర్నమెంట్ మధ్యలో దొరికిన గ్యాప్‌లో కమిన్స్ ఇలా వచ్చి అల్లరి చేయడం కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. కాగా, కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఇక ఎల్లుండి లీగ్ స్టేజ్‌లో బెంగళూరుతో జరగబోయే లాస్ట్ మ్యాచ్ కోసం టీమ్ రెడీ అవుతోంది.

మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ప్యాట్ కమిన్స్.. ఇలా మాల్‌లో జాన్వీ కపూర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడటం నిజంగా ఒక రేర్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అయితే జాన్వీ కొట్టిన దెబ్బకు అక్కడ ఎవరి కన్ను వాచిందో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ వీడియో ఫుల్ హిట్ అయిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu