Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగన్ మంచోడు కాబట్టే....సంచలన కామెంట్స్ !

జగన్ మంచోడు కాబట్టే....సంచలన కామెంట్స్ !

Tupaki.com 3 days ago

చాలా కాలానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు.

ముఖ్యంగా టీడీపీ పదే పదే గొడ్డలి పార్టీ అని వైసీపీని విమర్శిస్తున్న నేపధ్యంలో దాని మీద జగన్ ఘాటుగా స్పందించారు. ఎవరిది గొడ్డలి పార్టీ చంద్రబాబూ అని నిలదీశారు. గొడ్డలి గునపాలు, గన్ కల్చర్ ఎవరిది అన్నది జనాలకు బాగా తెలుసు అంటూ మొత్తం నాలుగు దశాబ్దాల హిస్టరీని రిపీట్ చేశారు.

మేము బాధితులం :

మా కుటుంబం అంతా బాధితులే అని జగన్ అన్నారు. మా తాత రాజారెడ్డిని హత్య చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాదా అని ప్రశ్నించారు. 1998 మే నెలలో ఈ హత్య జరిగిందని ఆయన గుర్తు చేశారు. మేమే గొడ్డలి పార్టీ అయితే తాత హత్య కేసులో నిందితులు ఈ రోజుకూ ప్రశాంతంగా తిరిగేవారా అని ప్రశ్నించారు. వారికి ఎప్పటికీ తమ ద్వారా ముప్పు రాదని అదే తమకు తండ్రి వైఎస్సార్ నేర్పించిన రాజకీయం అని జగన్ చెప్పారు. వైఎస్సార్ మరణం వెనక కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ రోజుకీ నివృత్తి చేయలేని సందేహాలు ఉన్నాయని జగన్ అన్నారు. వైఎస్సార్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అని హెచ్చరించిన సంగతి కూడా ఈ రోజుకీ క్లిప్పింగులలో ఉందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంతే కాకుండా తన సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే అన్నారు. హత్య చేసిన నిందితుడి తరఫున సుప్రీం కోర్టులో ఖరీదైన బాబు లాయర్ లూద్రా వాదిస్తున్నారని జగన్ విమర్శించారు.

బోత్ ఆర్ నాట్ సేం :

ఇదిలా ఉంటే వైసీపీ టీడీపీ బోత్ ఆర్ నాట్ సేం అని జగన్ సెటైర్లు వేశారు. తమ పార్టీ కష్టాలను ఎదురొడ్డి ప్రజల మద్దతుతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెన్నుపోటుతో పార్టీని దోచేసిన హిస్టరీ మీదని విమర్శించారు. మంచి పనులు చేసి చూపించడం వైసీపీ స్టైల్ అయితే పబ్లిసిటీ క్రెడిట్ చోరీ టీడీపీ స్టైల్ అన్నారు. మానిఫేస్టోని చెత్తబుట్టలో వేయడం టీడీపీ కారెక్టర్ అయితే ఆరు నూరు అయినా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వైసీపీ కారెక్టర్ అని జగన్ అన్నారు.

అమరావతిలో అవినీతి :

ఇదిలా ఉంటే రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ సాగుతోందని వైసీపీ అధినేత విమర్శించారు. ఇప్పటికే 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఉండగా మళ్ళీ వాటి పేరుతో భారీ నిర్మాణాలు అంటూ ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని అన్నారు. అన్నీ కూడా అధిక రేట్లతో నిర్మాణాలు చేస్తున్న తీరుని చూసిన రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయేలా ఈ అవినీతి ఉందని జగన్ విమర్శించారు. మొత్తానికి చూస్తే జగన్ ప్రెస్ మీట్ లో అమరావతి అవినీతిని మరోసారి ప్రస్తావించడంతో పాటు గొడ్డలి పార్టీ అని తమ పార్తీ మీద చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. అలాగే బోత్ ఆర్ నాట్ సేం అని మంత్రి లోకేష్ చేస్తున్న కామెంట్స్ కి జగన్ స్పందించారు అని అంటున్నారు. దీని మీద టీడీపీ నుంచి వచ్చే కౌంటర్లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu