Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జై కొట్టు: జనసేన 'బ్రహ్మాస్త్రం'!

జై కొట్టు: జనసేన 'బ్రహ్మాస్త్రం'!

Tupaki.com 2 weeks ago

పీలో అధికారం పంచుకున్న జనసేన పార్టీ తాజాగా బుధవారం.. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది.

దీనికి సంబంధించినలోగో, గీతం, వెబ్‌సైట్ వంటి వాటిని ఆవిష్కరిం చారు. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో యువజన విభాగం.. `జైకొట్టు` లోగోను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మంత్రి నాదెండ్ల ఆవిష్కరించారు.

`జై కొట్లు జనసేన యూత్ వింగ్‌` పేరుతో ఆవిష్కరించిన ఈ లోగోలో.. పిడికిలి బిగించిన చేయి పైకి లేవగా.. నాయకుడి ముందు యువత జెండాలు పట్టుకుని ముందుకు కదులుతున్న దృశ్యం అద్భుతంగా ఉంది. అంతేకాదు.. నాయకుడు సహా యువత తలకు కట్టుతో..పటిష్టమైన కార్యోన్ముఖతో.. లక్ష్య కార్యసాధన దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఈ లోగోను రూపొందించారు. సేవా ఉద్యమ కార్యాచరణ దిశను ఈ లోగో స్పష్టం చేస్తోంది.

చెయ్యెత్తి జైకొట్టు..

చెయ్యెత్తి జొకొట్టు.. అనే స్ఫూర్తిదాయక నినాదం నుంచి ఈ `జై కొట్టు` పదాన్ని తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అరుపులు-కేకలు.. రాజకీయం కాదని, క్రమశిక్షణకు మారు పేరుగా మారాలన్న ఉద్దేశంతోనే జై కొట్టు నినాదాన్ని ఎంచుకున్నామన్నారు. యువతకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. యువతకు అపారమైన అవకాశాలు కల్పించాలన్నది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యమని నాదెండ్ల వివరించారు.

పార్టీపై ప్రత్యేక ముద్ర

జనసేన పార్టీ ఆవిర్భవించిన పుష్కర కాలం తర్వాత..పార్టీలో కొత్తగా `జై కొట్టు` పేరుతో ఏర్పాటు చేసిన యువజన విభాగం ప్రత్యేక ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వీరమహిళ అనే మహిళా విభాగానికి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే.. జెన్‌జీ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వారిని మరింత బలోపేతం చేసేలా.. పార్టీకి అనుకూలంగా మార్చేలా.. `జై కొట్టు యూత్ వింగ్‌` యువతను ఆకర్షించడంలో బ్రహ్మాస్త్రంగా పనిచేయనుందని పరిశీలకులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu