Dailyhunt
జులై నుంచి చరణ్‌-సుకుమార్ బరిలోకి!

జులై నుంచి చరణ్‌-సుకుమార్ బరిలోకి!

Tupaki.com 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. గతంలో ఇద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `రంగస్థలం` బాక్సాఫీస్ ఎలాంటి రికార్డులు సాధించిందో తెలిసిందే.

మళ్లీ దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు జత కట్టడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆర్సీ 17 జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని రిలీవ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ నెలలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమ వుతోంది.

ఈ సినిమా కి సంబంధించి ప్రచార కార్యక్రమాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు ముగిసే వరకు చరణ్ కొంతకాలం పాటు రిలాక్స్ మోడ్లో ఉంటాడు. జూన్‌లో `పెద్ది` విడుదలైన అనంతరం జూలై నుండి సుకుమార్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రీ-ప్రొడక్షన్ పనులను తుది దశకు చేర్చారు. చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని విభిన్నమైన కథాంశాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. `రంగస్థలం`లో చిట్టిబాబు పాత్రతో చరణ్‌లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన సుకుమార్? ఈసారి అంతకు మించిన పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసినట్లు ప్రచారం పీక్స్ లో జరుగుతోంది.

ఈ క్రేజీ కాంబినేషన్ కసం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే జూలై నుంచి ప్రారంభం కానున్న షెడ్యూల్ కోసం భారీ సెట్లు కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుందా ? ఆధునిక కాలపు యాక్షన్ డ్రామాగా ఉంటుందా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే సుకుమార్ శైలిలో ఉండే ఎమోషన్స్ - రామ్ చరణ్ మాస్ అప్పీల్ సినిమాలో పుష్కలంగా ఉంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

మరో వైపు రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు. టాప్ డైరెక్టర్లరు అందర్నీ లైన్ లో పెడుతున్నారు. ఎవరితోనూ తొందరపడి కమిట్ అవ్వకుండా అందర్నీ హోల్డ్ లో పెట్టి ఉంచుతున్నాడు.

వారిలో ఉత్తమ దర్శకుల్ని ఎంపిక చేసుకుని లైనప్ పై ఓ క్లారిటీ కి వస్తారు. `పెద్ది` సక్సెస్ అనంతరం ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. `పెద్ది`ని మించి గొప్ప హిట్ ఇవ్వాలని చరణ్ భావిస్తాడు. మరోవైపు `పుష్ప` ను మించి భారీ విజయాన్ని అందించాలని సుకుమార్ అంతే కాన్పిడెంట్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆ రకంగా ఆర్సీ 17 ఇద్దరికీ కీలకంగా మారుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu