Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ : బీసీ కార్డు భయపెడుతుందా ?

కాంగ్రెస్ : బీసీ కార్డు భయపెడుతుందా ?

Tupaki.com 2 weeks ago

స్తినలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మంత్రి కొండా సురేఖను పదవి నుండి తప్పించడం ఖాయం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధిష్టానం నుండి అందిన సంకేతాల నేపథ్యంలోనే ఇప్పటి వరకు తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకేం సంబంధం అన్న కొండా సురేఖ ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోరు ?

ఆయన కూడా పార్టీ నియమావళికి విరుద్దంగా మాట్లాడారు కదా. బీసీ సామాజిక వర్గం కాబట్టే నా మీద కుట్రలు పన్నుతున్నారా ? అని ఆరోపించింది.

నేను పద్మశాలి. నా భర్త మున్నూరు కాపు. మా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తెలంగాణలో 16 శాతం ఉన్నాయి. ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పార్టీ టికెట్లు ప్రకటిస్తున్నాడు ? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి, మంత్రి పొంగులేటి మీద వచ్చిన ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు ? చాలా మంది రెడ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎందుకు చర్యలు తీసుకోలేదు ? నేను బీసీని కాబట్టే నా మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారా ? అంటూ కొండా సురేఖ బీసీ వాదాన్ని, ప్రధానంగా తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు, పద్మశాలి సామాజిక వర్గాలను వివాదంలోకి లాగింది.

హస్తినలో ఏఐసీసీ ముఖ్యులతో జరిగిన చర్చలలో కొండా సురేఖ మీద వేటు ఖాయం అన్న విషయం ఆమె మాటలతోనే తేలిపోయింది. అందుకే నేను రాజీనామా చేయను, ఒకవేళ బర్తరఫ్ చేస్తే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాను అని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మీద వేటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తుంది.

కొండా సురేఖ మీద వేటు వేస్తే బీసీ సామాజిక వర్గాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ? కొండా సురేఖతో పాటు ఆరోపణలు వచ్చిన చిన్నారెడ్డిని కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించాలన్న సిఫారసు క్రమశిక్షణ సంఘం చేసింది.. అయితే కొండా సురేఖను మాత్రమే తొలగించాలి అని సిఫారసు చేస్తే బీసీ అన్న వాదన వస్తుందనే, చిన్నారెడ్డిని కూడా తొలగించాలని ఆ సిఫారసులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

అయితే చిన్నారెడ్డికి నేరుగా సోనియాగాంధీ కుటుంబంతో నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. 1985లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్తానం ప్రారంభించిన ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు ఎన్నడూ పార్టీ మారిన చరిత్ర లేదు.

గత ఎన్నికల్లో మొదట టికెట్ చిన్నారెడ్డికే ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మేఘారెడ్డికి సీటు కేటాయించినా ఆయన పార్టీని వీడకుండా ఉన్నాడు. ఆ తరువాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనులు చేయకుండా అడ్డుపడుతున్నాడని, గత ఎన్నికల్లో తనకు వచ్చిన సీటును మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడని చిన్నారెడ్డి ఆరోపించాడు.

అయితే ఇప్పుడు చిన్నారెడ్డిని పదవి నుండి తప్పించాలంటే ఖచ్చితంగా దానికి సోనియాగాంధీ ఆమోదముద్ర అవసరం. కొండా సురేఖ విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నా సరిపోతుంది. అందుకే కొండా సురేఖ ఒక్కరినే పదవి నుండి తప్పిస్తే బీసీ వ్యతిరేకి అన్న ముద్ర పడుతుందని, చిన్నారెడ్డి మీద వేటుకు ఆమోదం కోసం వేచిచూసే దోరణిలో ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో సోనియాగాంధీ నుండి చిన్నారెడ్డిని పదవి నుండి తొలగించేందుకు ఆమోదం లభిస్తుందా ? ఒకవేళ అనుమతి రాకుంటే కొండా సురేఖను పదవి నుండి ఎలా తప్పిస్తారు ? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరు మాట్లాడిన చర్యలు తీసుకోకుండా కొండా సురేఖను తప్పిస్తే పరిస్థితి ఏంటన్న అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు హైదరాబాాద్ లో కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తమ అనుచరులతో సమావేశమై, ఢిల్లీలో జరిగిన చర్చల గురించి వివరించి తదుపరి కార్యాచరణ వెల్లడిస్తారని అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయో వేచిచూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu