Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కడుపుబ్బా నవ్వించిన నరేషన్.. 'క్రేజీ కళ్యాణం' టీజర్ లాంచ్ లో అనుపమ

కడుపుబ్బా నవ్వించిన నరేషన్.. 'క్రేజీ కళ్యాణం' టీజర్ లాంచ్ లో అనుపమ

Tupaki.com 3 weeks ago

'క్రేజీ కళ్యాణం' టీజర్ లాంచ్ ఈవెంట్ పాజిటివ్ వైబ్స్ తో సాగింది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అనుపమ పరమేశ్వరన్ తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మైక్ తీసుకున్న ఆమె, ఈ సినిమా జర్నీ గురించి, కోస్టార్స్ తో తన అనుభవాల గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. మొదటగా డైరెక్టర్ బద్రప్ప గాజుల గురించి ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

నరేషన్ వినడానికి ముందు ఒక కొత్త డైరెక్టర్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లిన అనుపమకు, బద్రప్ప ఇన్నోసెన్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఏకంగా రెండున్నర గంటల పాటు ఆయన ఇచ్చిన నరేషన్ లో కడుపుబ్బా నవ్వించే సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉండటంతో, కథ పూర్తవగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని అనుపమ తెలిపారు. తనకంటూ ఒక ఈగో లేకుండా, ఎవరైనా సజెషన్స్ ఇస్తే లాజికల్ గా ఆలోచించి యాక్సెప్ట్ చేసే మనస్తత్వం బద్రప్పది అని ఆమె కితాబిచ్చారు.

నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి గురించి చెబుతూ, సినిమాకు ఏది మంచిదో అది అర్థం చేసుకుని సపోర్ట్ చేసే నిర్మాత ఆయన అని అన్నారు. ఇక సీనియర్ నటుడు నరేష్ తో అనుపమకు ఇది మూడో సినిమా. "అ ఆ, శతమానం భవతి తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి నటిస్తున్నాను. నా లక్కీ చార్మ్ ఆయన. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ మునుపటి కంటే చాలా విభిన్నంగా ఉంటుంది" అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఒక సీన్ లో వర్షంలో తడిసిపోయే ఎపిసోడ్ లో నరేష్ యాక్టింగ్, డెడికేషన్ చూసి నేను షాక్ అయ్యాను. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అన్నారు.

అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అఖిల్ రాజ్ గురించి ప్రస్తావిస్తూ, "అఖిల్ చాలా నాచురల్ గా నటించాడు. ఈ సినిమా తర్వాత అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను తన ఫస్ట్ సినిమా చూడలేదు కానీ కచ్చితంగా చూస్తాను" అని అఖిల్ పై ప్రశంసలు కురిపించారు అనుపమ.

ఇక సినిమాలో తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ గురించి చెప్పిన ఒక పాయింట్ అందరినీ నవ్వించింది. "సినిమాలో తరుణ్ క్యారెక్టర్ నరేషన్ విన్నప్పటి నుంచి నాకే ఆ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందేమో అని డైరెక్టర్ తో అన్నాను. ఆ పాత్ర అంత క్రేజీగా ఉంటుంది అని అనుపమ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక టీజర్ లాంచ్ లో అనుపమ స్పీచ్ ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్ ని మరింత పెంచింది. తన టీమ్ అంతా ఎంత ఫ్రెండ్లీగా కలిసి పని చేశారో ఆమె మాటల్లో అర్థమైంది. 'క్రేజీ కళ్యాణం' ఒక బ్యూటిఫుల్, క్యూట్ అండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu