Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళ్లలో నమ్మకం, బాడీ లాంగ్వేజ్ తో కమిట్ అయ్యే హీరో!

కళ్లలో నమ్మకం, బాడీ లాంగ్వేజ్ తో కమిట్ అయ్యే హీరో!

Tupaki.com 1 week ago

టసింహ బాలకృష్ణతో సినిమా చేయాలంటే? ఆయనకు స్టోరీ మొత్తం చెప్పి ఒప్పించాల్సిన పనిలేదు. లైన్ తో మెప్పించి పట్టాలెక్కించొచ్చు. ఎందుకంటే బాలయ్య కథ కంటే?

దర్శకుడిపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టి ముందుకెళ్లిపోతుంటారు. చాలా వరకూ బాలయ్య సక్సెస్ కూడా అయ్యారు. అందుకే ఇప్పటికీ అదే విధానంలో సినిమాలు చేస్తున్నారు. తనకు నమ్మకం కుదరకపోతే తప్ప! బాలయ్య పూర్తి కథ వినడం అన్నది చాలా రేర్ గా జరుగుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ లో కూడా ఇలాంటి ఓ ప్రత్యేకత ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సినిమాల ఎంపికలో సల్మాన్ అనుసరించే పద్ధతులు బాలీవుడ్ హీరోల కంటే భిన్నంగా ఉంటాయి. సల్మాన్ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఒక్క సినిమా స్క్రిప్ట్‌ను కూడా పూర్తిగా చదవలేదని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. కాగితాలపై ఉండే కథలను చదవడం తనకు ఎప్పుడూ అలవాటు లేదన్నారు. ఒక దర్శకుడు లేదా రచయిత వచ్చి కథను తనకు వినిపించినప్పుడు అందులోని భావోద్వేగాలను బట్టే తాను సినిమాను ఓకే చేస్తానన్నారు. `ఎవరైనా వచ్చి నాకు కథను లైవ్‌గా వివరిస్తున్నప్పుడు వారి కళ్లలో ఉండే నమ్మకం, వారి బాడీ లాంగ్వేజ్ నాకు ముఖ్యం. అంతే తప్ప వందల పేజీల స్క్రిప్ట్ ముందు పెట్టుకుని చదివే ఓపిక నాకు లేదు` అని ముక్కుసూటిగా చెప్పారు.

ఈ రకమైన కథల ఎంపిక విధానం వల్లనే తాను కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని కొన్ని పరాజయాలను కూడా చూశానని సల్మాన్ అంగీకరించారు. అయితే ఒక సినిమాకు సంతకం చేయడానికి కథ వినడం మాత్రమే కాకుండా సదరు దర్శకుడితో తనకు ఉండే వ్యక్తిగత అనుబంధం, నమ్మకం కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు. తాను ఎంచుకునే కథలు సామాన్య ప్రేక్షకుడిని అలరించేలా, వినోదాత్మకంగా ఉన్నాయా లేదా అనే కోణంలోనే ఆలోచిస్తానన్నారు. చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది నటీనటులు స్క్రిప్ట్‌లోని ప్రతి డైలాగ్‌ను, ప్రతి సన్నివేశాన్ని నిశితంగా అధ్యయనం చేసి సెట్స్‌లోకి అడుగుపెడుతుంటారు.

కానీ సల్మాన్ ఖాన్ మాత్రం పూర్తి భిన్నంగా సెట్స్‌పై దర్శకుడు చెప్పే సూచనలను బట్టి సహజంగా నటించడానికే ఇష్ట పడతారు. ఈ ముక్కుసూటి తత్వమే సల్మాన్ సినిమాల్లో కనిపించే లార్జర్-ద్యాన్-లైఫ్ పాత్రలకు ప్లస్ అవుతుందని అభిమానులు నమ్ముతుంటారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్క్రిప్ట్ చదవకుండానే `బజరంగీ భాయిజాన్`, `సుల్తాన్`, `టైగర్` సిరీస్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడం సల్మాన్ ఖాన్‌కే సాధ్యమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో మారుతున్న నేటి తరం సినిమాలో కథలోని లోతును అర్థం చేసుకోవడానికి స్క్రిప్ట్ రీడింగ్ ఎంతైనా అవసరమనే చర్చ కూడా మొదలైంది. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ రూల్స్‌కు లొంగరని మరోసారి ప్రూవ్ అయింది. 2026లో కూడా సొంత ఫార్ములాతోనే సినిమాలు చేస్తున్నారు. తన మనసుకు నచ్చిన కథలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. స్క్రిప్ట్ చదివినా? చదవకపోయినా? వెండితెరపై సల్మాన్ ఇచ్చే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి చాలదా? అన్నది ట్రేడ్ నిపుణుల అంచనా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu