Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెమెరా ముందుకొస్తారా? రాజకీయాలకే పరిమితమా?

కెమెరా ముందుకొస్తారా? రాజకీయాలకే పరిమితమా?

Tupaki.com 1 week ago

మిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

విజయ్ ఎన్నికల బరిలోకి దిగడానికి ముందే తాను సినిమాలకు పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రకటించారు. నాటి నుంచి తన దృష్టి అంతా ప్రజాసేవపైనే ఉంటుందని స్పష్టం చేశారు. అయితే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరుణంలో అభిమానుల్లో , సినీ రాజకీయ వర్గాల్లో ఒకే ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. భవిష్యత్తులో విజయ్ మళ్లీ మేకప్ వేసుకునే అవకాశం ఉందా? లేక రాజకీయంగా మరింత బలంగా మారడానికే పరిమితమవుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...

సినిమా రంగానికి విజయ్ ఇచ్చిన వీడ్కోలు తాత్కాలిక విరామం కాదని బలమైన రాజకీయ పునాది కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టమవుతోంది. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటించిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ విజయ్ ప్రస్తుత పరిస్థితులు వేరు. పూర్తి స్థాయి మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచిన పార్టీ అతడిది. ఇతర పార్టీల మద్దతుతో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న తరుణంలో విజయ్ పూర్తి సమయాన్ని పరిపాలనకే కేటాయించాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి క్లిష్టమైన రాజకీయ సమీకరణాల మధ్య ఆయన మళ్లీ సినిమా సెట్స్‌కు వెళ్లే అవకాశం చాలా తక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని రాజకీయంగా స్థిరత్వం ఏర్పడిన తర్వాత అభిమానుల కోసం , సామాజిక సందేశం ఇచ్చే ఉద్దేశంతో విజయ్ మళ్లీ ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేసే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేము. ప్రస్తుతానికి విజయ్ ముందున్న ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రిగా తన పరిపాలనతో ప్రజల మనసులు గెలుచుకోవడం , పార్టీ టీవీకేను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం.

హంగ్ అసెంబ్లీ తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల నుండి ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ముద్ర ఉన్న తమిళనాడులో తనకంటూ ప్రత్యేకమైన విజయ్ మార్క్ పాలనను చూపించి రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదగడానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సినిమా గ్లామర్ అనేది ఓట్లు రాల్చడానికే కాకుండా? ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక సాధనంగా మాత్రమే విజయ్ భావిస్తున్నారు. అందుకే ఆయన సినిమాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. నటుడిగా వందల కోట్లు సంపాదించే అవకాశాన్ని వదులుకుని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ రాబోయే ఐదేళ్లూ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా, పరిపాలకుడిగానే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు.

చివరిగా విజయ్ మళ్లీ వెండితెరపై మెరుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన యాక్షన్ చెప్పే దర్శకుడి చేతుల్లో లేరు. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వెండితెరపై రికార్డులు సృష్టించిన విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఎలాంటి ప్రజారంజక నిర్ణయాలతో దూసుకుపోతారో చూడాలి. నటుడిగా విజయ్ ప్రయాణానికి ముగింపు పడినట్లు భావించినా? ప్రజా నాయకుడిగా అసలైన సినిమా ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu