Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేన్స్‌లో సంచలనం.. మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ దాడి!

కేన్స్‌లో సంచలనం.. మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ దాడి!

Tupaki.com 2 days ago

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. అందాల పోటీల విజేత, మిస్ వెనిజులా ఆండ్రీ డెల్ వాల్‌పై ఆమె పర్సనల్ సెలబ్రిటీ స్టైలిస్ట్ జియోవన్నీ లగునా కత్తెరతో ఘోరంగా దాడి చేశాడు.

గ్లామర్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కేన్స్ వేదికగా ఇలాంటి క్రూరమైన దాడి జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి..

హటల్ రూమ్‌లో ఏం జరిగింది?:

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మిస్ వెనిజులా ఆండ్రీ డెల్ వాల్ అక్కడకు చేరుకున్నారు. ఇక రెడ్ కార్పెట్‌పై మెరిసేందుకు హోటల్ రూమ్‌లో మేకప్, స్టైలింగ్ చేసుకుంటున్న సమయంలో ఆమెకు, స్టైలిస్ట్ జియోవన్నీ లగునాకు మధ్య ఏదో విషయంలో గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో లగునా ఒక్కసారిగా ఆమెపై భౌతిక దాడికి దిగాడు.

కత్తెరతో ముఖంపై దాడి:

కేవలం మాటలతో ఆగకుండా, స్టైలింగ్ కోసం చేతిలో ఉన్న కత్తెరతో ఆండ్రీ డెల్ వాల్ ముఖంపై లగునా దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా కొట్టాడు. ఇక ఈ దాడిలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మరకలతో ఉన్న తన ముఖాన్ని ఆండ్రీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

నిందితుడు ఎవరో తెలుసా?:

ఈ దాడికి పాల్పడిన జియోవన్నీ లగునా సాదాసీదా వ్యక్తి కాదు. లాటిన్ అమెరికాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా అతనికి మంచి గుర్తింపు ఉంది. ఇక ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, మోడళ్లకు ఇతను స్టైలిస్ట్‌గా వర్క్ చేశాడు. అంత పేరున్న సెలబ్రిటీ స్టైలిస్ట్, ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఇలా కత్తెరతో దాడి చేయడాన్ని ఫ్యాషన్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసులు:

బాధితురాలు ఆండ్రీ డెల్ వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫ్రెంచ్ అధికారులు వెంటనే యాక్షన్‌లోకి దిగారు. హోటల్ రూమ్‌కు చేరుకుని నిందితుడు జియోవన్నీ లగునాను అరెస్ట్ చేశారు. ఇక అసలు వారిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరగడానికి గల కారణాలు ఏంటి? అంతలా కోపం రావడానికి గల అసలు విషయాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

అందాల వేదికపై మెరిసిపోవాల్సిన ఒక మోడల్, ఇలా రక్తపు గాయాలతో కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. స్టైలింగ్ రూమ్‌లలో సెలబ్రిటీల భద్రతపై ఈ ఘటన పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. మరి ఈ కేసులో ఫ్రెంచ్ పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu