Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేవలం ఒక్క షాట్.. డ్రాగన్ హైప్ మొత్తం అతని వైపే!

కేవలం ఒక్క షాట్.. డ్రాగన్ హైప్ మొత్తం అతని వైపే!

Tupaki.com 4 days ago

నిల్ కపూర్ పేరు వినగానే బాలీవుడ్‌లో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్టార్‌డమ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఆయన గురించి టాలీవుడ్ వర్గాల్లోనూ అదే రేంజ్ లో డిస్కషన్ మొదలైంది.

దానికి కారణం డ్రాగన్ గ్లింప్స్. ఇప్పటికే మాస్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో వైరల్ అయిన ఈ గ్లింప్స్ లో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే కనిపించిన అనిల్ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

ముఖ్యంగా గ్లింప్స్ లో ఆయన ఇంటెన్స్ లుక్, కళ్లలో కనిపించిన ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. గ్లింప్స్ చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ డ్రాగన్ లో అనిల్ కపూర్‌ది మామూలు సపోర్టింగ్ రోల్ కాదని, కథను మలుపుతిప్పే క్యారెక్టర్ కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ క్యారెక్టర్ను చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

హీరో ఎలివేషన్ మాత్రమే కాకుండా కథలోని కీలక పాత్రలకు కూడా బలమైన ఇంపాక్ట్ ఇవ్వడం ప్రశాంత్ నీల్ స్టైల్. గతంలో ఆయన రూపొందించిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా భారీ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడదే తరహాలో డ్రాగన్‌లో అనిల్ కపూర్ పాత్రను కూడా డెప్త్, ఎమోషన్, పవర్‌తో తీర్చిదిద్దినట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన అనిల్ కపూర్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు దారి తీస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్- అనిల్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. కొందరు ట్రేడ్ విశ్లేషకులైతే డ్రాగన్‌లో అసలు ఎమోషనల్ వెయిట్ అనిల్ కపూర్ పాత్రదే అయ్యే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా ద్వారా అనిల్ కపూర్‌కు నార్త్ మార్కెట్‌లోనే కాకుండా సౌత్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడి, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకోగా, అనిల్ కపూర్ లాంటి వెటరన్ నటుడు జాయిన్ కావడం వల్ల హిందీ ప్రేక్షకుల్లో డ్రాగన్ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ టేకింగ్, భారీ యాక్షన్ టోన్, ఎమోషనల్ క్యారెక్టర్ డిజైన్.. ఇవన్నీ కలిసి ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. టీజర్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన ఫ్రేమ్స్‌లో అనిల్ కపూర్ షాట్స్ ఉండటం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్లిన ఈ వెటరన్ యాక్టర్ కు ఇప్పుడు డ్రాగన్ మరో కెరీర్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu