Dailyhunt
'ఖమేనీ' కోసం తెగ వెతికేస్తున్నారు!

'ఖమేనీ' కోసం తెగ వెతికేస్తున్నారు!

Tupaki.com 6 days ago

మెరికా, ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధంతో అట్టుడుగుతున్న ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమే నీ వ్యవహారం .. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఆయన జీవించి ఉన్నారా? లేరా? అనే విషయంపై పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నేతలు ఆన్‌లైన్‌లో వెతికేస్తున్నారు. అదేసమయంలో గూఢచార వర్గాల ద్వారా కూడా సమాచారం తెప్పించుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ మీడియా కూడా ఈ విషయంపైనే దృష్టి పెట్టింది.

ట్రంప్ మరింత..

తాజాగా ఖమేనీ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్య సమావేశం నిర్వహించారని.. వాషింగ్టన్ పోస్టు ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. సుప్రీం లీడర్ జీవించి ఉన్నారా? ఉంటే ఏపరిస్థితిలో ఉన్నారు? ఎక్క డున్నారు..? అనే విషయాలపై అంతర్గత సమావేశంలో చర్చించినట్టుపేర్కొంది. అమెరికాకు ఉన్న సమాచారం మేరకు ఖమేనీ.. గత ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ సహా.. ఆయన కుమార్తె, భార్య(తర్వాత కొన్ని రోజులకు చనిపోయారు), మనవలు కూడా మృతి చెందారు.

అదే దాడుల్లో మొజ్తబా కూడా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ, దీనిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తర్వాత పేర్కొంది. కానీ, దీనిని అగ్రరాజ్యం విశ్వసించలేదు. తనకు ఉన్న సమాచారం మేరకు మొజ్తబా ప్రమాదంలో ఉన్నారని.. ఆయన తమ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని.. వైద్య చికిత్స చేయించుకుంటున్నారని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. కానీ, తాజాగా ఇరాన్‌.. మరోసారి మొజ్తబా వ్యవహారంపై లీకులు ఇచ్చింది. దీంతో ట్రంప్ అంతర్మథనంలో పడ్డారు.

ఇది లావుంటే.. ప్రస్తుతం మొజ్తబా కోమాలో ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. తీవ్రంగా గాయపడి ఆయన కదలలేని, ఆలోచించలేని.. స్థితిలో ఉన్నారని.. ఆయన ఎక్కువ రోజులు జీవించి ఉండే అవకాశం లేదని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ కోసం.. ప్రపంచ దేశాలు వెతుకుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్‌లో మొజ్తబా కోసం ప్రార్థనలు జరిగినట్టు తెలియడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియా పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu