Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిక్ బాక్సింగ్ తో విషాదం.. పునీత్ మరణం వెనుక ఏం జరిగింది?

కిక్ బాక్సింగ్ తో విషాదం.. పునీత్ మరణం వెనుక ఏం జరిగింది?

Tupaki.com 1 hr ago

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తు మరణం తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలను, కోట్లాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.

ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపే పునీత్ అంత అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కంటతడి పెట్టించింది. ఆయన మరణించి ఏళ్లు గడుస్తున్నా, ఆ విషాదకర సంఘటన గురించిన జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను బాధిస్తూనే ఉన్నాయి. తాజాగా పునీత్ చివరి క్షణాల గురించి ఆయన డాక్టర్ రమణారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంచలన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తొలిసారి కిక్‌బాక్సింగ్.. అలసటతో ఆరోగ్యం అటకెక్కి:

అత్యాధునిక ఫిట్‌నెస్ కలిగి ఉండే పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్ 29న తన జీవితంలో తొలిసారిగా 'కిక్‌బాక్సింగ్' ట్రై చేశారని డాక్టర్ రమణారావు తెలిపారు. ఎప్పుడూ చేసే సాధారణ వర్కౌట్లకు బిన్నంగా సుమారు గంటన్నర పాటు నాన్‌స్టాప్‌గా కిక్‌బాక్సింగ్ చేయడం ఆయన శరీరానికి విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఆ తీవ్రమైన అలసటతోనే ఆయన నేరుగా డాక్టర్ రమణారావు క్లినిక్‌కు చేరుకున్నారు. ఇక అక్కడ ఆయనను పరీక్షించిన డాక్టర్లకు ఈసీజీ (ECG) రిపోర్ట్‌లో గుండెపై విపరీతమైన స్ట్రెయిన్ పడినట్లు స్పష్టంగా తేలింది.

ఆసుపత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే విషాదం:

పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే డాక్టర్లు ఆయన్ని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారు. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి కారులో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. కేవలం మరో నిమిషంలో ఆసుపత్రికి చేరుతామనే సమయంలోనే పునీత్ హార్ట్‌బీట్ పూర్తిగా ఆగిపోయింది. ఇక ఆసుపత్రికి చేరేసరికి అప్పటికే ఆయన గుండె పనిచేయడం నిలిచిపోయింది. దాదాపు మూడు గంటల పాటు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి, సీపీఆర్ చేసి బతికించడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఫిట్‌నెస్ మోజులో అతిగా శ్రమిస్తే ప్రమాదమే:

ఫిట్‌గా ఉండటం మంచిదే అయినప్పటికీ, శరీరం తట్టుకోలేనంత తీవ్రమైన వ్యాయామాలు, ముఖ్యంగా కొత్త రకాలైన హెవీ వర్కౌట్లు ఏకసమయంగా చేయడం ఎంత ప్రమాదకరమో పునీత్ మరణం మనకు నిరూపిస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవనుకునే ఫిట్ వ్యక్తులను సైతం గుండెపోటు ఏ విధంగా కబలిస్తుందో ఈ ఘటన హెచ్చరికగా నిలిచింది. పునీత్ లాంటి వ్యక్తి కేవలం ఒక్క రోజు చేసిన కిక్‌బాక్సింగ్ అతిశ్రమ కారణంగా ప్రాణాలు కోల్పోవడం సినీ లోకానికి తీరని లోటు.

ఇక మొత్తానికి చూస్తే, పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలకు సంబంధించిన డాక్టర్ రమణారావు మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సామాజిక సేవలు, అందించిన మధురమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఇక వ్యాయామాలు చేసేటప్పుడు శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదనే ఒక పెద్ద పాఠాన్ని పునీత్ మరణం మనకు మిగిల్చింది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu