Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కింద పడి లేచి నిలబడేవాడి కథ 'పెద్ది': రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

కింద పడి లేచి నిలబడేవాడి కథ 'పెద్ది': రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

Tupaki.com 1 week ago

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ `పెద్ది` ప్రమోషన్స్‌లో భాగంగా బెజవాడలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక ప్రొఫెషనల్ ఎంఎంఏ (MMA) ఫైటర్ తరహాలో ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఉర్రూతలూగించారు.

చరణ్ ఈ రోజు బెజవాడలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినప్పుడు ఫ్యాన్స్ సందడి పీక్స్ కి చేరుకుంది. ఈ వేడుకలో చరణ్ ఎమోషనల్ స్పీచ్ ఆకట్టుకుంది.

ఈ వేడుకలో రామ్ చరణ్ తన ప్రసంగంతోను అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. పెద్ది కథ నా హృదయానికి చాలా దగ్గరగా హత్తుకుని ఉన్న కథ అని పేర్కొన్న చరణ్‌ ఇలాంటి కథ పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. కిందకి పడి.. పడిన మనిషి లేచి ఎలా నిల్చుంటాడో, అలాంటి కథ ఇది! అని చెప్తూ, ఈ సినిమా కోసం తను కష్టంతో కాకుండా ఇష్టంతో, ప్రేమతో పనిచేశానని స్పష్టం చేశారు. గతంలో మగధీర, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు కలిగిన అనుభవం మళ్ళీ `పెద్ది` చిత్రానికే కలిగిందని చరణ్ వివరించారు.

దర్శకుడు బుచ్చిబాబు సనపై చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. బుచ్చిబాబు ఒక కథను కేవలం స్టోరీలా కాకుండా ఒక వ్యక్తి ప్రయాణంలా వివరించారని.. భవిష్యత్తులో ఇండియాలోని టాప్ డైరెక్టర్ల జాబితాలో ఆయన పేరు తప్పకుండా ఉంటుందని జోస్యం చెప్పారు. తనను వ్యక్తిగతంగా కూడా ఒక మంచి దారిలోకి మార్చిన ఈ చిత్రం తన సినిమా కెరీర్‌లోని లైబ్రరీలో టాప్ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు, కథానాయిక జాన్వీ కపూర్, జగపతి బాబు తదితరులు పాల్గొని సందడి చేయగా, యాంకర్ సుమ తనదైన శైలిలో జోష్ పెంచారు

చివరగా అభిమానులనే తన బలంగా పేర్కొంటూ చరణ్ భావోద్వేగపూరితమైన హామీ ఇచ్చారు. మీ కోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు.. రక్తం చిందించి కూడా పనిచేస్తాను అని చెబుతూ, తాను చనిపోయే వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని మాటిచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరిగాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఓపెనింగులతో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu