Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త జేమ్స్ బాండ్ కోసం అన్వేషణ!

కొత్త జేమ్స్ బాండ్ కోసం అన్వేషణ!

Tupaki.com 1 week ago

హాలీవుడ్ ఐకానిక్ స్పై ఫ్రాంచైజీ `జేమ్స్ బాండ్` అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్. ఈసారి జేమ్స్ బాండ్ అయ్యే అవకాశం మీ ముందు కూడా ఉంది? ట్యాలెంట్ ఉంటే ఆ అవకాశం మీకే రావొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం. ఓ రాయి వేసి చూడండి. వివరాల్లోకి వెళ్తే.. 2021లో రిలీజ్ అయిన `నో టైమ్ టు డై` చిత్రంతో డేనియల్ క్రెయిగ్ బాండ్ పాత్రకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి తదుపరి 007 ఏజెంట్ ఎవరనే దానిపై గ్లోబల్ స్థాయిలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. తాజాగా అమెజాన్ ఎమ్ జీఎమ్ స్టూడియోస్ తదుపరి జేమ్స్ బాండ్ కోసం అధికారికంగా అన్వేషణ ప్రారంభించినట్లు ప్రకటించింది.

`తదుపరి జేమ్స్ బాండ్ కోసం వెతుకులాట మొదలైంది` అంటూ స్టూడియో ప్రతినిధులు ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ అన్వేషణ ప్రక్రియలో భాగంగా అమెజాన్ ఎమ్ జీఎమ్ అత్యంత ప్రతిభావంతురాలైన కాస్టింగ్ డైరెక్టర్ నినా గోల్డ్ సేవలను వినియోగిం చుకుంటోంది. నినా గోల్డ్ గతంలో `గేమ్ ఆఫ్ థ్రోన్స్`, `ది క్రౌన్`, `స్టార్ వార్స్` వంటి భారీ ప్రాజెక్టులకు కాస్టింగ్ నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కొత్త బాండ్ కోసం ఇప్పటికే గత కొన్ని వారాలుగా ఆడిషన్లు జరుగుతున్నట్లు సమాచారం. అనుభవం ఉన్న నటుల కంటే? బాండ్ పాత్రకు సరికొత్త ఊపిరి పోయగల ఫ్రెష్ ఫేస్ కోసం మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

బాండ్ పాత్ర కోసం సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఆరోన్ టేలర్-జాన్సన్, హెన్రీ కావిల్, జాకబ్ ఎలోర్డి , కల్లమ్ టర్నర్ వంటి నటులు ఈ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే స్టూడియో మాత్రం ఎవరి పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. ఇందులోనే ట్యాలెంట్ ఉంటే? కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామన్నారు. `సరైన సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలను అభిమానులతో పంచుకుంటాం` అని అమెజాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని 2027లో షూటింగ్ ప్రారంభమై 2028లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెజాన్ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బాండ్ వారసత్వాన్ని గౌరవిస్తూనే నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్‌ను రీబూట్ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం అత్యుత్తమ మేకింగ్ టీమ్‌ను రంగంలోకి దించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బాండ్ వ్యక్తిత్వంలోని లోతైన కోణాలను అతని గతాన్ని ఒక ఏజెంట్‌గా అతని ఎదుగుదలను ఈసారి మరింత విడమర్చి చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి జేమ్స్ బాండ్ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వం వహించబోతున్నారు.

`డ్యూన్` వంటి దృశ్య కావ్యాలను అందించిన విల్లెనూవ్ బాండ్ ప్రపంచాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిం చబోతున్నారని సమాచారం. దీనికి తోడు `పీకీ బ్లైండర్స్` సృష్టికర్త స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ అందించంతో సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. గత బాండ్ సినిమాల కంటే ఈ చిత్రం మరింత బలమైన, ధైర్యవంతమైన వైవిధ్యమైన కథాంశంతో ఉండబోతుందని స్టీవెన్ నైట్ హింట్ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu