Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమిలో జూనియర్ గానే... బీజేపీ బలమెంత ?

కూటమిలో జూనియర్ గానే... బీజేపీ బలమెంత ?

Tupaki.com 2 weeks ago

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కూటమితో జట్టు కట్టి పోటీ చేసింది. రెండు మేయర్ సీట్లు ఇచ్చారు. అందులో రాజమహేంద్రవరం ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఒక్క మేయర్ సీటు అనంతపురంలో అది చేజారింది. ఇపుడు చూస్తే జెడ్పీ పీఠాలలో కడపను బీజేపీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే మొత్తం జెడ్పీటీసీలలో బీజేపీ వాటా అలాగే ఎంపీటీసీలలో కూడా బీజేపీకి దక్కినవి చూసినపుడు బీజేపీ బలం ఎంత పెరిగింది అన్న చర్చ వస్తోంది.

సొంత బలం కాదు :

పొత్తులలో ఏడు శాతం వాటాను దక్కించుకున్న బీజేపీ స్థానిక సంస్థల గెలిచిన స్థానాలు ఎన్ని అన్నది చూస్తే కనుక మునిసిపాలిటీలలో బీజేపీ గెలిచిన వార్డులు 152 దాకా ఉన్నాయి. అలాగే బీజేపీ 4 మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. పరిషత్తు ఎన్నికల్లో బీజేపీ 19 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఎంపీటీసీ 120 దాకా గెలిచింది. ఇక బీజేపీ గెలిచిన స్థానిక సంస్థల సీట్లలో బలం అయితే సొంతది కాదనే అంటున్నారు. మిత్రపక్షం టీడీపీ ఓట్ల బదలాయింపు లేకపోతే కనుక బీజేపీకి ఇబ్బంది అయ్యేదని అంటున్నారు. ఇక బీజేపీకి ఎంత మద్దతు ఇచ్చినా వైసీపీ చాలా చోట్ల ఎంపీటీసీలుగెలిచింది వార్డులు గెలిచింది బీజేపీ అభ్యర్ధుల మీదనే అని అంటున్నారు.

వైసీపీకి లాభంగా :

బీజేపీకి సొంతంగా గ్రామీణ ప్రాంతాలలో కానీ అర్బన్ లో అనేక చోట్ల కానీ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు. అనంతపురం కార్పోరేషన్ మేయర్ సీటుని కూడా వైసీపీ బీజేపీ నుంచే గెలుచుకుంది అని అంటున్నారు. అలాగే 2024లో అరకు రాజంపేట ఎంపీ సీటుని బీజేపీ నుంచే వైసీపీ గెలుచుకుంది.ఇక 2024లో 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే అందులో రెండు వైసీపీ గెలిచిందని అంటున్నారు. ఇలా పొత్తు పార్టీగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చినా అందులో కొన్ని ఓటమి పాలు అవుతోంది అని అంటున్నారు.

జనసేన సంస్థాగతంగా బలం :

అదే జనసేనకు పొత్తులో సీట్లు ఎక్కువ ఇచ్చినా సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో గెలుస్తున్నసంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. దానికి కారణం జనసేన సంస్థాగతంగా బలం పెంచుకుంటోంది. బలమైన నాయకత్వం పవన్ రూపంలో ఉంది. బీజేపీకి ఆ విధమైన పరిస్థితి లేకపోవడం వల్లనే ఎప్పటికీ జూనియర్ పార్టనర్ గా కూటమిలో ఉంటోంది అని అంటున్నారు. మరి పొత్తులతోనే బీజేపీ కాలం వెళ్లబుచ్చుకుంటోందని రెండున్నరేళ్ల కూటమి పాలనలో అధికారంలో ఉండి కూడా పార్టీని విస్తరించుకోలేకపోయిందని అంటున్నారు. ఎంపీటీసీల విషయానికి వస్తే తాజా ఎన్నికల్లో 285 కి పోటీ చేస్తే 120 దక్కాయి అని అంటున్నారు. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలంటే ఎక్కువ సీట్లు పొత్తులో తెచ్చుకుని గెలవాలి అన్నా కూడా ఇప్పటినుంచే పార్టీని పటిష్టం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu