Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!

లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు!

Tupaki.com 1 week ago

రిశ్రమలో సాంకేతికంగా.. కథల పరంగా ఎన్నో మార్పులు కనిపిస్తున్నా? లింగ వివక్ష - బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఇంకా సమానత్వం రాలేదని నటి జ్యోతిక అభిప్రాయపడ్డారు.

తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో జ్యోతిక మహిళా ప్రధాన చిత్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లపై ముక్కుసూటిగా మాట్లాడారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పరిశ్రమలో తగినంత బడ్జెట్ లభించడం లేదన్నారు. దీంతో కథలో సత్తా ఉన్నా? ఇతర పెద్ద నటీనటులను ఆయా ప్రాజెక్టులలో భాగం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక స్టార్ హీరో సినిమాకు వందల కోట్ల బడ్జెట్ ఇచ్చేందుకు వెనుకాడని నిర్మాతలు మహిళా నటి ప్రధాన పాత్రలో నటించే చిత్రానికి మాత్రం బడ్జెట్ పరిమితులు విధిస్తున్నారు. `మహిళా ప్రధాన చిత్రాలకు కేటాయించే బడ్జెట్ ఎంత తక్కువగా ఉంటుం దంటే? కేవలం కథానాయిక పారితోషికం , ప్రాథమిక నిర్మాణ ఖర్చులకే అది సరిపోతుంది. ఆ సినిమాలో కీలక పాత్రల కోసం మరో స్టార్ నటుడిని లేదా నటిని తీసుకుందామన్నా? బడ్జెట్ సహకరించదు అని కఠిన వాస్తవాన్ని ఎండగట్టారు. ఇదే ఇంటర్వ్యూలో జ్యోతికతో పాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ కూడా పాల్గొన్నారు.

వారు కూడా జ్యోతిక వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. తమ నుంచి రాబోయే వెబ్ సిరీస్ `సిస్టమ్` మోషన్లలో భాగంగా మాట్లాడిన వీరు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత కొంతవరకు మార్పు కనిపిస్తున్నా? థియేట్రికల్ సినిమాల విషయంలో మహిళా మార్కెట్‌ను తక్కువ చేసి చూసే ధోరణి ఇంకా మారలేదన్నారు . కంటెంట్ ఎంత బాగున్నా? హీరో లేకపోతే బిజినెస్ కాదనే పాత ఆలోచనా విధానంలోనే చాలా మంది ఉండిపోయారని విమర్శించారు. మహిళా చిత్రాలకు భారీ బడ్జెట్ ఇస్తేనే విజువల్స్ పరంగా, మేకింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకోగలవని జ్యోతిక అభిప్రాయపడ్డారు.

కేవలం పరిమిత బడ్జెట్‌తో గదిలోనే సాగే కథలను మాత్రమే కాకుండా మహిళా యాక్షన్ చిత్రాలను లేదా భారీ స్కైల్ డ్రామాలను రూపొందించాలంటే మేకర్స్ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. అప్పుడే మహిళా నటుల నటనలోని పూర్తి స్థాయి ప్రతిభ ,కమర్షియల్ స్టామినా ప్రపంచానికి తెలుస్తుందన్నారు. కొన్ని నెలల క్రితం అనుపమా పరమేశ్వరన్ కూడా లేడీ ఓరియేటెడ్ం చిత్రాలకు సరైన మద్దతు దక్కడం లేదని..వాటిని కమర్శియల్ సినిమాల్లా ప్రేక్షకులు చూడటం లేదని విమర్శించిన సంగతి తెలిసిందే. వారిలో కూడా సినిమా చూసే కోణం మారాలని హితవు పలికారు.

జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో `36 వయదినిలే`, `మగలిర్ మట్టుమ్`, `పొన్‌మగళ్ వందాళ్` వంటి బలమైన మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ అనుభవంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దక్షిణ భారతదేశంలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని సోనాక్షి సిన్హా ఉదాహరణలతో వివరించారు. ఈ వివక్షను అధిగమించడానికి కథానాయికలే స్వయంగా నిర్మాతలుగా మారి సినిమాలు తీయాల్సిన అవసరం వస్తోందని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu