Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లెజెండ్ బయోపిక్స్‌లో ప్రధాన పాత్రల ఎంపిక ఎలా!

లెజెండ్ బయోపిక్స్‌లో ప్రధాన పాత్రల ఎంపిక ఎలా!

Tupaki.com 1 week ago

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్స్ జీవిత కథలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పాల్సిన పనిలేదు.సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తుల కథలను వెండి తెరపై ఆవిష్కరిస్తే అదో అద్భుతం.లెజెండ్స్ కథలు నవతరంలోనూ ఎనలేని స్పూర్తినింపుతున్నాయి.

క్రీడ, వైద్య, విద్య, వ్యాపార, చలన చిత్ర రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలకు ఎంతో డిమాండ్ ఉంది. అలాంటి కథలను వెండి తెరపైకి తీసుకురావాల్సిన బాధ్యత నవతరం దర్శక, రచయితలపై అంతే ఉందన్నది కాదనలేని నిజం.

మరి ఇలాంటి కథల్ని తెరకెక్కించే ముందు దర్శక, రచయితలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. పాత్రల ఎంపిక విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే? కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. తెరపై ఒకరి జీవితాన్ని ఆవిష్కరించేటప్పుడు సాధారణ కథలకంటే భిన్నంగా కాస్టింగ్ ప్రక్రియపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లలో ప్రధాన పాత్ర పోషించే నటీనటులను ఎంపిక చేసే ముందు దర్శకులు ప్రాథమికంగా అనేక కీలక లక్షణాలను, అంశాలను నిశితంగా పరిశీలిస్తారు.

మొదటిది అత్యంత ముఖ్యమైనది రూపం. సదరు ప్రముఖుడి శరీర దారుఢ్యం, నడక, ముఖ కవళికలు , హావ భావాలు ఎంచుకున్న నటుడితో ఏ మేరకు సరిపోలుతున్నాయనేది దర్శకులు ప్రధానంగా చూస్తారు. మేకప్‌తోనే కాకుండా నటుడి సహజ సిద్ధమైన పోలికలు , ఆకృతి సదరు లెజెండ్‌ను గుర్తుచేసేలా ఉండటం ప్రేక్షకులు కథలో త్వరగా మమేకం కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. రెండవది నటనలో లోతు.. అంకితభావం. బయోపిక్‌లలో నటించడం అంటే డైలాగులు చెప్పడం కాదు. ఆ వ్యక్తి జీవితంలోని ఎమోషనల్ గ్రాఫ్‌ను, సంఘర్షణను తెరపై పండించడం.

సదరు పాత్రలోని భావోద్వేగాలను పక్కాగా పలికించగల నటనానైపుణ్యం ఉందో ?లేదో? పరిశీలిస్తారు. అంతేకాదు ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందడానికి, అవసరమైతే బరువు పెరగడానికి లేదా తగ్గడానికి నటుడు సిద్ధంగా ఉన్నారా? అనేది వారి అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడవది వాయిస్ మాడ్యులేషన్ .. శైలి. ప్రతి ప్రముఖుడికి మాట్లాడే విధానంలో, స్వరంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సదరు లెజెండ్ మేనరిజమ్‌లను, డైలాగ్ డెలివరీ శైలిని అనుకరించకుండా సొంతం చేసుకోగల నైపుణ్యం నటుడికి ఉందా? లేదా? అనేది ప్రధానంగా గమనిస్తారు.

శబ్ద పరిజ్ఞానం , యాసను పట్టుకోగల సామర్థ్యం బయోపిక్ క్యారెక్టర్‌కు ప్రాణం పోస్తాయి. నాలుగవది ప్రేక్షకులతో కనెక్టివిటీ ..క్రెడిబిలిటీ. ఎంచుకున్న నటుడికి అప్పటికే ఉన్న ఇమేజ్ సదరు లెజెండ్ ఇమేజ్‌ను దెబ్బతీయకుండా ఉందో? లేదో? చూస్తారు. నటుడి మునుపటి పాత్రల ప్రభావం బయోపిక్ పాత్రపై పడకుండా తెరపై ఆ మహనీయుడు మాత్రమే కనిపించేలా ప్రేక్షకులను నమ్మించగల సామర్ద్యం ఉందో? లేదో? ఆడిషన్స్ ద్వారా గుర్తిస్తారు. చివరిగా లెజెండ్ బయోపిక్‌లో ప్రధాన పాత్రకు ఎంపిక కావడం అనేది నటుడికి ఎంతటి గౌరవమో? దర్శకుడికి అంతటి సవాలుతో కూడుకున్న వ్యవహారం. రూపం, నటన, మేనరిజమ్స్ ,అంకితభావాల మేళవింపు కుదిరినప్పుడే ఆ బయోపిక్ విజయం సాధించడంతో పాటు చరిత్రలో గొప్ప కావ్యంగా నిలిచిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu