Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లెజెండ్రీ సింగర్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ లో స్టార్ హీరోయిన్.. పూర్తి వివరాలు ఇవే!

లెజెండ్రీ సింగర్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ లో స్టార్ హీరోయిన్.. పూర్తి వివరాలు ఇవే!

Tupaki.com 2 weeks ago

త కొన్ని సంవత్సరాలుగా తెరపై పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రీడారంగాలకు చెందిన గొప్ప వారి బయోపిక్ లు తెరపై దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందే.

స్వాతంత్ర్య సమరయోధుల జీవిత కథలు మళ్ళీ తెరపై కదలాడుతూ.. వారికి జీవం పోస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది దివంగత సెలబ్రిటీల బయోపిక్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వారికి తెలియని ఎన్నో విషయాలను అందరికీ తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అద్భుతమైన సంగీతంతో, గాత్రంతో శ్రోతలను అలరించిన లెజెండ్రీ సింగర్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ రాబోతోంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తెరపైకి కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక స్టార్ హీరోయిన్ ని మేకర్స్ ఫైనల్ చేశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక మందన్న..

ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సమాచారం ప్రకారం.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ లో ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. జెర్సీ, మళ్ళీరావా, కింగ్ డమ్ లాంటి ఎమోషనల్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.. నిజానికి ఈ సినిమాలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని తర్జనభర్జన పడ్డారట మేకర్స్. పైగా సాయి పల్లవి అయితే బాగుంటుందని కూడా ఆలోచించారట. కానీ ఆమె ప్రస్తుతం హిందీ రామాయణ సినిమాలో బిజీగా ఉండడంతో ఈ పాత్ర నుండి వైదొలిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిర్మాతగా అల్లు అరవింద్..

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ బన్నీ వాసు చిత్రానికి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కూడా సంయుక్తంగా ఈ సినిమాను కలిసి నిర్మిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఎం .ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ పాత్రలో రష్మిక మందన్న పేరు వినిపిస్తుండడంతో ఆమె ఒదిగిపోతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రష్మిక మందన్న ఎంపికపై సోషల్ మీడియాలో కామెంట్స్..

మరోవైపు సుబ్బలక్ష్మి పాత్ర కోసం ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నేటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ బయోపిక్ కోసం మొదటి ఎంపిక సాయి పల్లవి కదా.. ఆమె ఎక్కువ పారితోషకం అడిగి ఉండవచ్చు లేదా ఈ ఐకానిక్ పాత్రను దక్కించుకోవడానికి రష్మిక తన పలుకుబడిని ఉపయోగించి ఉండవచ్చు అని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పాత్రలో రష్మిక న్యాయం చేసి, ఆమెపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మరొకవైపు మైసా చిత్రంతో పాటు తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tupaki Telugu